ఆయుధ పూజ.. సందడి | - | Sakshi
Sakshi News home page

ఆయుధ పూజ.. సందడి

Oct 1 2025 10:19 AM | Updated on Oct 1 2025 10:21 AM

● టీ నగర్‌లో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం ● వాస్తవాలన్నీ బయటకు వస్తాయ్‌.. ● వీడియో విడుదల చేసిన విజయ్‌ ● త్వరలో బాధితుల్ని కలుస్తానని వ్యాఖ్య ●ఇద్దరు టీవీకే నేతల అరెస్టు

న్యూస్‌రీల్‌

మార్కెట్లన్నీ కిటకిట

పూజా సామాగ్రి ధరలకు రెక్కలు

చైన్నె నుంచి స్వస్థలాలకు తరలిన జనం

రోడ్డెక్కిన ప్రత్యేక బస్సులు

కుల శేఖరపట్నంలో సంబరాలు

ఐ యామ్‌ స్ట్రాంగెస్ట్‌

అవార్డుల ప్రదానం

సాక్షి, చైన్నె: ఆర్మీకి విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన వారిని ఐయామ్‌ స్ట్రాంగెస్ట్‌ అవార్డులతో షారన్‌ ఫ్‌లై సత్కరించింది. ప్రముఖ ఫ్‌లైవుడ్‌ బ్రాండ్‌గా ఉన్న షారన్‌ ఫ్‌లై 6వ వార్షిక అవార్డుల వేడుక మంగళవారం చైన్నెలో జరిగింది. ఇందులో ఐయామ్‌ స్ట్రాంగెస్ట్‌ 2025 అవార్డులను ప్రదానం చేశారు. పదవీ విరమణ పొందిన సీనియర్‌ ఆర్మీఅ ధికారులు లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌. హరి మోహన్‌ అయ్యర్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ దుష్యంత్‌ సింగ్‌, లెప్టినెంట్‌జనరల్‌ పీఆర్‌శంకర్‌, మేజర్‌ జనరల్‌ రాజీవ్‌ నారాయణన్‌కు ఈ అవార్డులను షారన్‌ ఫ్‌లై వ్యవస్థాపకుడు , ఎండీ విష్ణు ఖేమాని సత్కరించారు. దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు, ఆర్మీ అధికారుల మార్గదర్శకాలు, దేశ సరిహద్దులలో భద్రత విధులలో ఉన్న వారి సేవలను ఈసందర్భంగా గుర్తుచేస్తూ వారందరికీ వీర వందనం సమర్పించారు.

ప్రారంభం

సేవల విస్తరణలో భాగంగా చైన్నె పళ్లికరనైలో కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ కొత్త శాఖ ఏర్పాటు చేశారు. దీనిని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ పి పొన్నయ్య, పళ్లికరనై వేలమ్మాల్‌ బోధిక్యాంపస్‌ ప్రిన్సిపాల్‌ సి జమునా శక్తి వేల్‌లు ప్రారంభించారు. – సాక్షి, చైన్నె

ఆవిష్కరణ

మానుషులలో ఐక్యతను చాటే విధంగా స్రంగీత దర్శకుడు నవనీత్‌ సుందర్‌ కొత్తగా ఒరు మాలై నేరత్తిల్‌ పేరిట ఆల్బమ్‌ను రూపొందించారు. ఏఐ విజువల్స్‌తో రూపొందించిన ఈ ఆల్బామ్‌ను స్థానికంగా మంగళవారం ఆవిష్కరించారు. అక్టోబరు 2వ తేదీన దీనిని విడుదల చేయనున్నారు. – సాక్షి, చైన్నె

ఐఐటీ అక్వాటిక్స్‌ మీట్‌

స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా ఐఐటీ మద్రాసులో39వ ఇంటర్‌ – ఐఐటీ అక్వాటిక్స్‌ మీట్‌ మంగళవారం ప్రారంభమైంది. ఐఐటీ హైదరాబాద్‌, తిరుపతిలతో కలిసిఅక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్న ఈమీట్‌ను అర్జున అవార్డు గ్రహీత సెబాస్టియన్‌ జేవియర్‌, ఐఐటీ మద్రాసు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి కామ కోటి, డీన్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ ఎన్‌గుమ్మడిలు ప్రారంభించారు. ఇందులో 17 ఐఐటీలు పాల్గొంటున్నాయని, ప్రధాన క్రీడోత్సవం డిసెంబర్‌లో జరుగుతుందని ఈసందర్భంగా ప్రకటించారు. – సాక్షి, చైన్నె :

ప్రమాదాలపై అవగాహన

అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ సీమా అగర్వాల్‌ ఆదేశాలతో చైన్నె బ్రాడ్‌ వే షావుకారు పేటలోని డేరా పంత్‌ జైన్‌ విద్యాలయంతో పాటూ ఉత్తర చైన్నెలోని పాఠశాలలో దీపావళి సందర్భంగా ఏదేని ప్రమాదాలు జరిగిన పక్షంలో సహాయక చర్యల గురించి రెస్క్యూ డ్రిల్‌ మంగళవారం జరిగింది. నార్త్‌ జోన్‌ అగ్నిమాపక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణన్‌, ఉత్తర చైన్నె జిల్లా అధికారి రాబిన్‌ కాస్ట్రో, అసిస్టెంట్‌ డ్రిస్టిక్‌ ఆఫీసర్‌ మురుగన్‌, సబర్బన్‌ జిల్లా అధికారులు లోకనాథన్‌ నేతృత్వంలో వందలాదిగా అగ్నిమాపక వీరులు వీరోచితంగా శ్రమిస్తూ సహాయక చర్యలలో మునిగే విధంగా ముందుకు సాగారు. బాణసంచా కారణంగా ఎదురయ్యే ప్రమాదాలను విద్యార్థులకు వివరించారు. వాటిని ఎలా జాగ్రత్తగా కాల్చాలో వివరించారు. – సాక్షి, చైన్నె

రాష్ట్రంలో మంగళవారం నుంచే ఆయుధ పూజ సందడి నెలకొంది. పండుగ బుధవారమైనప్పటికీ ఒక రోజు ముందుగానే కోలాహలం మిన్నంటింది. పూజా సామాగ్రి కొనుగోలుకు జనం మార్కెట్లకు పోటెత్తారు. అన్ని రకాల పూజా సామాగ్రి ధరలకు రెక్కలు వచ్చాయి. ఇంటిళ్లి పాది పండుగను ఆనందోత్సాహలతో జరుపుకునేందుకు చైన్నె నుంచి లక్షలాది మంది ప్రత్యేక బస్సులు, రైళ్ల ద్వారా స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు.

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో వినాయక చవి తదుపరి వచ్చే ఆయుధ పూజ, విజయ దశమి పర్వదినాలకు ప్రజలు మరింత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోంది. ఇందులో చిన్న చిన్న దుకాణాల మొదలు అతి పెద్ద ఫ్యాక్టరీల వరకు, కూలీల మొదలు రైతుల వరకు తాము ఉపయోగించే వివిధ రకాల సామాగ్రి, పనిమూట్లకు పూజలు నిర్వహించే రీతిలో ఆయుధ పూజను అత్యంత భక్తి శ్రద్ధల పర్వదినంగా భావిస్తుంటారు. ఇంటిళ్లి పాది అత్యంత భక్తితో ఈ పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతోంది.

స్వస్థలాలకు పయనం

ఈ ఏడాది పండుగకు ముందే శని, ఆదివారాలు కలిసి రావడంతో సోమ, మంగళ సెలవు పెట్టుకుని అత్యధిక శాతం మంది ప్రజలు ఇప్పటికే స్వస్థలాలకు వెళ్లారు. బుధవారం ఇంటిళ్లి పాది ఆయుద పూజను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. చైన్నె వంటి నగరాలలో వివిధ పనులు చేసుకుంటూ, ఉద్యోగాలలో ఉన్న వాళ్లు దక్షిణ తమిళనాడు, కొంగు మండలంలలోని స్వస్థలాలకు అత్యధికంగా బయలుదేరి వెళ్లారు. మంగళవారం రాత్రంతా ప్రత్యేక బస్సులను చైన్నె నగరం, శివారులలోని బస్టాండ్‌ల నుంచి రోడ్డెక్కించడంతో లక్షల మంది ఆయుధ పూజ నిమిత్తం స్వస్థలాలకు వెళ్లినట్టు రవాణా సంస్థ పరిశీలనలో తేలింది. ఇదే అదనుగా ఆమ్నీ ప్రైవేటు బస్సులు చార్జీలను పెంచేశాయి. విమాన టికెట్లు సైతం గాల్లో ఎగిరాయి. మదురై, తిరుచ్చి, తూత్తుకుడి,సేలంలకు విమాన చార్జీలు రెడింతలు పెరిగాయి. ఈ బస్సులపై నిఘా ఉంచి తనిఖీలు ముమ్మరంగా జరిగాయి. మంత్రి శివ శంకర్‌ సైతం తనిఖీలలో నిమగ్నమయ్యారు.

నేతల శుభాకాంక్షలు

ఆయుధ పూజ, విజయ దశమి పండుగలను ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌, మాజీ సీఎం పన్నీరు సెల్వం, తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జికే వాసన్‌, బీజేపీ నేతలు నైనార్‌ నాగేంద్రన్‌, తమిళి సై సౌందరరాజన్‌, శరత్‌కుమార్‌, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ , పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి తదితరులు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.

సాక్షి, చైన్నె: గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ తరపున టీ నగర్‌సౌత్‌ ఉస్మాన్‌ రోడ్డు– సి.ఐ.టి. నగర్‌ ప్రధాన రోడ్డు ను అనుసంధానిస్తూ బ్రహ్మాండంగా నిర్మించిన వంతెనకు జె. అన్భుళగన్‌ ఫ్‌లై ఓవర్‌ అని నామకరణం చేశారు. దీనిని రూ.164.92 కోట్లతో నిర్మించారు. వివరాలు.. పెరుగుతున్న ట్రాఫిక్‌ను పరిగణనలోకి తీసుకుని, ప్రజలు సులభంగా రవాణా మార్గం కల్పించే విధంగా గత నాలుగు సంవత్సరాలలో చైన్నె మెట్రోపాలిటన్‌ కార్పొరేషన్‌ తరపున రూ.300.16 కోట్లతో 13 ప్రదేశాలలో కొత్త వంతెన మార్గాలను నిర్మించి ప్రజా ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నిత్యం రద్దీతో ఉండే టీ నగర్‌ పరిసరాలలో ట్రాపిక్‌ పద్మవ్యూహానికి మోక్షం కల్పించే విధంగా అత్యాధునిక సాంకేతికతతో బ్రహ్మాండ వంతెన నిర్మించారు. టీ నగర్‌ సౌత్‌ఉస్మాన్‌ రోడ్డు – సి.ఐ.టి. నగర్‌ ప్రధాన రోడ్డు అనుసంధానం దిశగా 3,800 మెట్రిక్‌ టన్నుల ఇనుముతో రూ. 164 కోట్ల వ్యయంతో వంతెనను నిర్మించారు.ఇది చైన్నెలో నిర్మించిన తొలి ఇనుప ఫ్‌లై ఓవర్‌కావడం గమనార్హం. దీనికి దివంగత డీఎంకే నేత జే అన్భళగన్‌ ఫ్‌లై ఓవర్‌ అని నామకరణం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి కృషి చేసిన దివంగత ఎమ్మెల్యే జే అన్బుళగన్‌ పేరునే పెట్టడం విశేషం.

800 మీటర్ల పొడవుతో..

నాలుగు జంక్షన్లను అనుసంధానించే విధంగా ఈ వంతెన రూపుదిద్దుకుంది. సౌత్‌ ఉస్మాన్‌ రోడ్డు, బర్కిత్‌రోడ్డు, బోగ్‌ రోడ్డు జంకషన్‌, సీఐటీ నగర్‌ జంక్షన్లు కలుపుతూ 1,200 మీటర్ల పొడవు, 8.40 మీటర్ల వెడల్పు, 53 ఇనుప స్తంభాల వెడల్పుతో రెండు లేన్ల రహదారిగా నిర్మించారు. సౌత్‌ ఉస్మాన్‌ రోడ్డులో ఇది వరకు ఉన్న 800 మీటర్ల పొడవైన కాంక్రీట్‌ ఫ్లైఓవర్‌తో తాజా హైటెక్‌ వంతెనను అనుసంధానించారు. ఈ ఫ్లైఓవర్‌ టీ నగర్‌ బస్టాండ్‌ నుంచి 2 కిలో మీటర్ల దూరం , సౌత్‌ ఉస్మాన్‌ రోడ్డులో 120 మీటర్ల దూరంతోపాటూ ఇరు వైపులా పాదచారులు నడిచేందుకు వీలుగా ఏర్పాటు, సర్వీసు రోడ్డు కూడా రూపుదిద్దుకుంది. సగటున రోజుకు 1 ,00,000 మంది, 40 వేలకు పైగా వాహనాలు ప్రయాణించే దిశగా సుమారు 2 లక్షలకు పైగా సాధారణ ప్రజలు ప్రయోజనంగా ఈ వంతెన ఉంటుందని ప్రకటించారు. సింగార చైన్నె వైపు ప్రయాణంలో కొత్త కొత్త సాంకేతికత చిహ్నంగా ఈ వంతెనను ప్రకటించారు. ఈ వంతెన గోడలు, రిటైనింగ్‌ వాల్స్‌పై టీ నగర్‌ విశిష్టతను చాటే పెయింటింగ్‌ను తీర్చిదిద్దారు. ఈ వంతెనను సీఎం స్టాలిన్‌ ప్రారంభించి, కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రు, ఎం సుబ్రమణియన్‌, శేఖర్‌బాబు, గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ మేయర్‌ ఆర్‌. ప్రియ, ఎంపీ ఎ.రాజ, ఎమ్మెల్యేలు జె. కరుణానిధి, టి.వేలు, తాయకం కవి, డిప్యూటీ మేయర్‌ ఎం. మహేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వంతెనపై నడుచుకుంటూ వెళ్తున్న సీఎం స్టాలిన్‌, మంత్రులు

బ్రహ్మాండ వంతెనను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్‌

సాక్షి, చైన్నె: కరూర్‌లో విజయ్‌ ప్రచార పర్యటన సందర్భంగా పెను విషాద ఘటన జరిగి మంగళవారంతో నాలుగు రోజులైంది. ఈ కేసును తీవ్రంగా పరిగణించి కరూర్‌ పోలీసులు టీవీకే వర్గాలపై కేసుల నమోదును వేగవంతం చేశారు. అరెస్టుల ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఈనేపథ్యంలో కరూర్‌ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్‌, కరూర్‌ నగర్‌ ఇన్‌చార్జ్‌ మాశి పొన్‌ రాజ్‌ను అరెస్టు చేశారు. ఈ ఇద్దరికి ఉదయాన్నే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కరూర్‌ కోర్టులో న్యాయమూర్తి భరత్‌ కుమార్‌ ఎదుట హాజరు పరిచారు. ఈ సమయంలో వాడివేడిగా వాదనలు, వాగ్వాదాలు సైతం చోటు చేసుకున్నాయి. తాము ఏ తప్పూ చేయలేదంటూ వాదిస్తూనే, కొన్ని ఆధారాలను న్యాయమూర్తికి టీవీకే తరపు న్యాయవాదులు సమర్పించారు. అయితే వాటిని ఆయన పరిగణించ లేదు. అనేక ప్రశ్నలను సంధించారు. విజయ్‌ను చూసేందుకు చిన్న పిల్లల మొదలు పెద్దల వరకు వస్తారన్నది తెలియదా? అని అసహనం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చి ఉన్నారన్న విషయాన్ని ముందుగానే విజయ్‌ దృష్టికి తీసుకెళ్లారా?, చిన్న స్థలంలో కాకుండా ఏదేని మైదానంను వేదికగా ఎంపిక చేసి ఉండ వచ్చుగా? అన్న అనేక ప్రశ్నలను సంధించారు. పోలీసుల తరపు న్యాయవాదులు వాదన సమయంలో జనం రద్దీ గురించి తాము ముందే భుస్సీ ఆనంద్‌ దృష్టికి తీసుకెళ్లామని, ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్‌ అర్జున్‌కు వివరించినా ఆయన అంగీకరించకుండా, విజయ్‌ ప్రచార రథాన్ని మరింత ముందుకు తీసుకెళ్లినట్టు వివరించారు. కరూర్‌ జంక్షన్‌ తదుపరి మునియప్పన్‌ ఆలయం వద్ద విజయ్‌ తన ప్రచార రథంలోకి వెళ్లి పోయారని, ఆయన తన సీటులోనే కూర్చుని ఉండి ఉంటే, ఆయన్ని చూసిన జనం అక్కడి నుంచి వెళ్లి పోయి ఉండే వారని, అయితే, ఆయన లోనికి వెళ్లడంతో చూడాలన్న ఆశతో ఆ రథం వెనుక పరుగులు తీశారని న్యాయమూర్తికి వివరించారు. వాదనల అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ, కరూర్‌నే కాదు, దేశాన్నే ఈ ఘటన కుదిపి వేసిందని, 41 మంది మరణించారని, ఇందులో 10 మంది పిల్లలు కూడా ఉన్నారని పేర్కొంటూ, ఈ కేసులో మనసాక్షికి కట్టుబడి ఆదేశాలు ఇస్తున్నానంటూ, ఆ ఇద్దరికి అక్టోబరు 14వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. కాగా, తమ భర్తలను పోలీసులు చిత్ర హింసలకు గురి చేసే అవకాశం ఉందని, వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ మది అళగన్‌ సతీమణి రాణి, పౌన్‌ రాజ్‌ సతీమణి మాలతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పోలీసులు అరెస్టుల ప్రక్రియపై దృష్టి పెట్టడంతో ఈకేసులో కీలకంగా ఉన్న భుస్సీ ఆనంద్‌, నిర్మల్‌కుమార్‌ ముందస్తు బెయిల్‌ కోసం మధురై ధర్మాసనంలో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు శుక్రవారం విచారణకు రానున్నాయి. ఇదిలా ఉండా కరూర్‌ ఘటన వ్యవహారంలో వదంతులు సృష్టిస్తున్న 25 మందిని గుర్తించి చైన్నె పోలీసులు కేసు నమోదు చేశారు.యూ ట్యూబర్‌ ఫెలిక్స్‌ను, టీవీకేకు చెందిన ఇద్దర్ని, బీజేపీకి చెందిన ఒకర్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినానంతరం రిమాండ్‌కు తరలించారు.

బీజేపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన

కరూర్‌ ఘటనకు సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు బీజేపీ నిజనిర్ధాణ కమిటీ మంగళవారం పర్యటించింది. ఆ పార్టీ ఎంపీ హేమ మాలిని నేతృత్వంలో 8 మంది ఎంపీలు కరూర్‌లో పర్యటించారు. తొలుత ఘటన జరిగిన ప్రదేశంలో పరిశీలించారు. అక్కడి వారితో మాట్లాడారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని చికిత్సలో ఉన్న వారిని పరామర్శించి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హేమమాలిని మీడియాతో మాట్లాడుతూ, విజయను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తారని తెలిసినప్పుడు , ఎలా చిన్న రోడ్డును కేటాయించారని ప్రశ్నించారు. ప్రచార సభ కోసం సరైన స్థలం కేటాయించలేదన్నారు. ఇరుకై న రోడ్డు, విద్యుత్‌ సరఫరా ఆగడం, చెప్పులు విసరడం వంటి అంశాలను పరిగణిస్తే, ఈ ఘటన యాధృచ్చికంగా జరిగినట్టు కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర వేదన అంటూ 41 మంది మరణించారని, 51 మంది చికిత్సలో ఉన్నారని గుర్తు చేశారు. ఈ ఘటనలో ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ పాలకులా... నిర్వాహకులా..? అని ప్రశ్నించారు. తమ అధిష్టానానికి నివేదికను సమరిస్తామని ముందుకు సాగారు. కాగా, కోయంబత్తూరు నుంచి కరూర్‌కు వచ్చే మార్గంలో హేమామాలిని పర్యటించిన కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. కాగా, కరూర్‌లో బీజేపీ ఎంపీల బృందం పర్యటనపై వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్‌ స్పందించారు. బహిరంగ రాజకీయా వ్యూహాలకు ఢిల్లీ పదును పెట్టినట్టుందని మండి పడ్డారు. జాతీయ కాంగ్రెస్‌ సైతం ఓ కమిటీని రంగంలోకి దించాలని సూచించారు. ఎండీఎంకే నేత వైగో స్పందిస్తూ, ఈ ఘటనలో విజయ్‌ను ఎందుకు అరెస్టు చేయకూడదని ప్రశ్నించారు. డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని హితవు పలికారు. మంత్రి అన్బిల్‌ మహేశ్‌ స్పందిస్తూ ఘటన జరిగిన రోజున అక్కడి పరిస్థితిని చూసి తాను ఉద్వేగానికి లోనైనట్టు, దీనిని కూడా విమర్శించడం శోచనీయమన్నారు. ఇక, ఈ ఘటనలో విజయ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ డీజీపీ కార్యాలయంలో ఒరువన్‌ సామాజిక సంస్థ అధ్యక్షుడు అరివళగన్‌ వినతి పత్రం సమర్పించారు. విజయ్‌కు వ్యతిరేకంగా, మద్దతుగా తిరుచ్చి, కరూర్‌ తదితర ప్రాంతాలలో పోస్టర్లు హోరెత్తడం గమనార్హం. ఇక, విజయ్‌ను అరెస్టు చేయాలని వీడియో విడుదల చేసిన సినీ నటి ఓవియాను టార్గెట్‌ చేస్తూ, సామాజిక మాధ్యమాలలో పోస్టులు వెల్లువెత్తాయి.

బాధితులతో మాట్లాడుతున్న బీజేపీ బృందం

టీవీకే నేతలను అరెస్టు చేసి తీసుకెళుతున్న పోలీసులు

నాలుగో రోజు వీడియో రూపంలో జనం ముందుకు విజయ్‌

ఘటన జరిగిన మూడు రోజులైనా విజయ్‌ బయటకు రాలేదు. కేవలం సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటనతో సరి పెట్టారు. ఇంత పెద్ద ఘటన జరిగితే కనీసం టీవీకే వర్గాలు ఏ ఒక్కరూ బాధితులను పరామర్శించక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం చేసే పనిలో పడ్డారు. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం విజయ్‌ తీరును ఎండగట్టారు. ఈ పరిస్థితులలో నాలుగో రోజైన మంగళవారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో ఓ వీడియో రూపంలో జనం ముందుకు విజయ్‌ వచ్చారు. వీడియోలోని వివరాలు ఆయన మాటల్లోనే ‘‘ అందరికీ నమస్తే.., నా జీవితంలో ఇంత వేదన ఎన్నడూ అనుభవించ లేదు. నన్ను చూడాలని ప్రచార సమయంలో జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని, నా మీద చూపుతున్న ప్రేమా అభిమానాలకు ఎల్లప్పుడు రుణ పడి ఉంటాను. ఆప్తులను కోల్పోయాం, కుటుంబాలను కోల్పోయాం..మరింత వేదనగా ఉంది..అందరి కుటుంబాలకు నా సంతాపం.. ఏం చెప్పినా లోటును తీర్చలేం. ఆస్పత్రిలో ఉన్న వాళ్లంతా త్వరగా కోలుకోవాలి. త్వరలో అందర్నీ కలుస్తా. ఈ సమయంలో నా వేదనలతో, బాధలో అండగా నిలబడ్డ రాజకీయ పక్షాల నేతలందరికీ’’ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆయుధ పూజ.. సందడి1
1/8

ఆయుధ పూజ.. సందడి

ఆయుధ పూజ.. సందడి2
2/8

ఆయుధ పూజ.. సందడి

ఆయుధ పూజ.. సందడి3
3/8

ఆయుధ పూజ.. సందడి

ఆయుధ పూజ.. సందడి4
4/8

ఆయుధ పూజ.. సందడి

ఆయుధ పూజ.. సందడి5
5/8

ఆయుధ పూజ.. సందడి

ఆయుధ పూజ.. సందడి6
6/8

ఆయుధ పూజ.. సందడి

ఆయుధ పూజ.. సందడి7
7/8

ఆయుధ పూజ.. సందడి

ఆయుధ పూజ.. సందడి8
8/8

ఆయుధ పూజ.. సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement