
మధుమేహం, ఊబకాయంపై అధ్యయనం
సాక్షి, చైన్నె : నేచర్ మెడిసినల్‌లో ప్రచూరితమైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – ఇండియా డయాబెటిస్ అధ్యయనం నుంచి సేకరించిన తాజా ఆధారాల మేరకు జరిగిన అధ్యయన వివరాలను మంగళవారం స్థానికంగా ప్రకటించారు. ఆహారపు అలవాట్లు మధుమేహం, ఊబకాయంలో నాటకీ పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయని ఈ అధ్యయన ఫలితాలలో వెలుడు చూసినట్టు వివరించారు. ఈ ఫలితాలను మద్రాసు డయాబెటిస్‌రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో క్రాస్– సెక్షనల్ సర్వే నుంచి 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల, నేషనల్ క్యాపిటల్ టెరిటరీలలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో జరిపినట్టు ఆ రెసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్‌వీ మోహన్ , సీనియర్ సైంటిస్టు డాక్టర్ సుధా, ఆ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఆర్‌ఎం అంజనాలు వివరించారు. ఈ పరిశోధన మేరకుఅధ్యయనంలో స్థూల పోషకాలు(కార్బోహైడ్రేట్, కొవ్వు, ప్రొటీన్) తీసుకోవడం ద్వారా ఆహార ప్రొఫైల్‌ల ప్రధాన ఫలితాలను వెలువడినట్టు వివరించారు. అధిక కార్బోహైడ్రేట్ కేలరీలు జీవ క్రియ ప్రమాదాన్ని పెంచుతాయని వివరించారు. ఒకసాధారణ ఆహార సర్దుబాటు జీవ ప్రక్రియ ప్రమదాన్ని తగ్గంచడంలో సహాయ పడే అంశాలను ఈసందర్భంగా విశదీకరించారు. ప్రతికూల ఆహార ప్రొఫైల్‌ను మధుమేహం, ఊబకాయంతో అనుసంధానిస్తున్న ల్యాండ్ మార్క్‌గా ఈ అధ్యయనం ఉన్నట్టు పేర్కొన్నారు.
సెంగోట్టయన్
మద్దతుదారులపై వేటు
సాక్షి, చైన్నె: ఎమ్మెల్యే సెంగోట్టయన్ మద్దతుదారులకు ఉద్వాసన పలికే విధంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చర్యలు చేపట్టారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన వాళ్లు, బహిష్కృత నేతలను మళ్లీ అక్కున చేర్చుకోవాలని ఇటీవల సెంగోట్టయన్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చేతిలో ఉన్న పార్టీ పదవిని పళణిస్వామి లాగేసుకున్నారు. ఆయన వెన్నంటి ఉన్న ముఖ్య నేతలను పార్టీ పదవుల నుంచి తప్పించారు. ఈ పరిస్థితులలో సెంగోట్టయన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న 40 మంది నాయకులను గుర్తించి వారిని పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈరోడ్ జిల్లాలోని ఈ నేతలను ఒకే రోజు పదవుల నుంచి తప్పించడం చర్చకు దారి తీసింది.

మధుమేహం, ఊబకాయంపై అధ్యయనం