
చరిత్ర సృష్టిద్దాం!
2.ఓ షురూ ముప్పెరుం విళాలో స్టాలిన్ కనిమొళికి పెరియార్ అవార్డు ప్రదానం అమిత్ షాకు మోకరిల్లి ముఖానికి కర్చీఫ్ ఎందుకో.. పళనికి చురక
ముప్పెరం విళాలో కేడర్‌కు అభివాదం చేస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా జరిగే ప్రధాన వేడుకై న ముప్పెరుం విళా వేడుక బుధవారం కనుల పండువగా సాగింది. ఈ కార్యక్రమ నిమిత్తం చైన్నె నుంచి తిరుచ్చికి విమానంలో, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పర్యటించారు. దారి పొడవున ఆయనకు డీఎంకే వర్గాలు, ప్రజలు బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానం పలికారు. ఓపెన్ టాప్ టెంపో నుంచి అందర్నీ పలకరిస్తూ వేదిక వద్దకు సాయంత్రం ఐదు గంటల సమయంలో స్టాలిన్ చేరుకున్నారు. ఓ వైపు కారు మబ్బులు కమ్ముకున్న వేళ వర్షం వస్తుందన్న కలవరం తప్పలేదు. అయినా, ముప్పెరుం విళాను విజయవంతంగా జరుపుకున్నారు. వర్షంలో సైతం తడుస్తూ కేడర్ ఆనందాన్ని పంచుకున్నారు. మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని నినదించారు.
పళనికి అమిత్ షా యే శరణం
ఈ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ, అన్నా ఆశయ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన అన్నాడీఎంకేను పిద్ధాంతాలకు విరుద్దంగా అమిత్ షాకు పళణి స్వామి తాకట్టు పెట్టేశారని, అందుకే ఇప్పుడు అమిత్ షా యే శరణం అంటూ మోకరిళ్లే పనిలో పడి ఉన్నారని మండి పడ్డారు. అన్నాడీఎంకే ను కాషాయం గుప్పెట్లోకి తీసుకెళ్లి పేట్టేసి అందర్నీ బానిసలుగా మార్చేశారని ధ్వజమెత్తారు. అమిత్ షాకు మోకరిళ్లి, పూర్తిగా కాషాయంలో మునిగిన పళణి స్వామికి ముఖం దాచుకునేందుకు కర్చీఫ్ ఎందుకో..? అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన కార్లు మార్చడం, ముఖానికి కర్చీఫ్ కప్పుకోవడం చూస్తే ఏ మేరకు కాషాయానికి బానిస అయ్యాడో అర్థం అవుతోందన్నారు. తమిళనాడులోకి బీజేపీకి నో ఎంట్రీ అని, తమిళనాడును తలదించుకునే పరిస్థితిని ఈ స్టాలిన్ ఎన్నడూ తీసుకు వచ్చే పరిస్థితులు లేవు అని స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధికి కాషాయం అడ్డు అని, అందుకే ఆది నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నామని, ఇక్కడ పాదం మొపనివ్వమని హెచ్చరించారు. తమిళనాడు రక్షణ డీఎంకే బాధ్యత , ఇదికొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం శ్రమించే కేడర్ తన వెన్నంటి ఉన్నంత కాలం ఎవ్వరు డీఎంకేను ఓడించ లేరని స్పష్టం చేశారు. ఎంత మంది అమిత్ షాలు వచ్చినా ఢీ కొడుతామని, 2026 అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ అధికారం మనదే...ద్రావిడ మోడల్ 2.ఓ అధికారంలోకి రావడం షురూ అని, దీనిని అడ్డుకోవడం ఎవరి తరం కాదని వ్యాఖ్యలు చేశారు.
2026 ఎన్నికలలో మళ్లీ గెలుపుతో చరిత్ర సృష్టిద్ధామని కేడర్‌కు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపు నిచ్చారు. ద్రావిడ మోడల్ 2.ఓ ప్రభుత్వం అధికారంలోకి రావడం షురూ అని, దీనిని అడ్డుకోవడం ఎవరి తరం కాదని ధీమా వ్యక్తం చేశారు. కరూర్ వేదికగా బుధవారం డీఎంకే ఆవిర్భావ దినోత్సవం, దివంగత నేత అన్నా జయంతి, పెరియార్ జయంతి వేడుకలను ముప్పెరుం విళా నిర్వహించారు.

చరిత్ర సృష్టిద్దాం!

చరిత్ర సృష్టిద్దాం!