
కనిమొళికి పెరియార్ అవార్డు
పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా జరుపుకున్న ఈ ముప్పెరుం విళాలో ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ అవార్డును డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి కరుణానిధికి ప్రదానం చేశారు. అన్నా అవార్డును పార్టీ నేత శుభా సీతారామన్‌కు, కలైంజ్ఞర్ కరుణానిధి అవార్డును మాజీ ఎమ్మెల్యే సో.మా. రామచంద్రన్‌కు ప్రదానం చేయనున్నారు. పావేందర్ అవార్డుకు పార్టీ ఎగ్జిక్యూటీవ్ సభ్యుడు కుళితలై శివరామన్‌కు, ప్రొఫెసర్ అన్భళగన్ అవార్డును మాజీ ఎమ్మెల్యే మరుధూరు రామలింగంకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అందజేశారు. ఈ అవార్డులకు గాను జ్ఞాపికతో పాటుగా తలా రూ. 3 లక్షలు చెక్కును అందజేశారు. ఇందులో కనిమొళి, రామచంద్రన్‌లు తమకు ఇచ్చిన చెక్కును పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించాలని కోరుతూ స్టాలిన్‌కు అందజేశారు.