
బెంగళూరు వెళ్తున్న విమానంలో ఇంజిన్ వైఫల్యం
– చైన్నెలో అత్యవసర ల్యాండింగ్
కొరుక్కుపేట: చైన్నె నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైనన్స్ విమానం మంగళవారం రాత్రి 160 మంది ప్రయాణికులు, ఐదుగురు విమాన సిబ్బంది సహా మొత్తం 165 మందితో బయలుదేరింది. విమానం వెల్లూరు సమీపంలో కాంచీపురం దాటి గాలిలో ఎగురుతుండగా, అకస్మాత్తుగా ఇంజిన్ సమస్య తలెత్తింది. పైలట్ వెంటనే దీనిని గమనించి చైన్నె విమానాశ్రయ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని తిరిగి చైన్నెకి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇంజిన్ లోపం తీవ్రంగా ఉండడంతో ప్రయాణికులందరినీ ప్రత్యామ్నాయ విమానంలో బెంగళూరుకు తరలించారు. పైలట్ గాలిలో ఇంజినన్‌లో సమస్యను గుర్తించి, సకాలంలో విమానాన్ని చైన్నెలో తిరిగి ల్యాండ్ చేయడంతో అతిపెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.
పుళల్ జైలు ప్రాంగణంలో 2,000 కోళ్లు మృతి
– ఖైదీల్లో బర్డ్ ఫ్లూ భయం?
తిరువొత్తియూరు: చైన్నె పుళల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలోని కోళ్ల ఫారంలో గత 4 రోజుల్లో 2,000 వరకు కోళ్లు మృతి చెందడంతో, ఖైదీల మధ్య బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందనే భయం నెలకొంది. వివరాలు.. తమిళనాడులోని అన్ని కేంద్ర జైళ్లలో ప్రారంభించబడిన ఇండిపెండెంట్ పౌల్ట్రీ ఫార్మింగ్ ప్రాజెక్ట్, జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫామ్‌లలో ఖైదీలను కోళ్ల పెంపకంలో పాల్గొనేలా చేయడం ద్వారా ప్రోటీన్–సమృద్ధిగా ఉండే ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీని ద్వారా, క్లాస్ ఎ ఖైదీలకు వారానికి 3 రోజులు, ఆది, మంగళ, గురువారాల్లో కోడి మాంసం, ‘బి’ ఆసుపత్రి ఖైదీలకు ఆది, బుధవారాల్లో కోడి మాంసం అందిస్తున్నారు. ఈ క్రమంలో చైన్నెలోని పుళల్ జైలు సముదాయంలోని కోళ్ల ఫారంలో గత 4 రోజుల్లో సుమారు 2,000 కోళ్లు చనిపోయాయని తెలుస్తోంది. కోళ్లు అకస్మాత్తుగా చనిపోవడానికి కారణం తెలియకపోయినా, ఖైదీలలో బర్డ్ ఫ్లూ పుకార్లు వ్యాపించాయి. చనిపోయిన కోళ్లన్నింటినీ జైలు ఆవరణలోనే పూడ్చిపెట్టారని తెలిసింది. దీనిపై అధికారులు అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నట్లు వినికిడి.
దక్షిణరైల్వేలో స్వచ్ఛతా హీ సేవ
సాక్షి, చైన్నె: దక్షిణ రైల్వే నేత్తృవంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. పక్షం రోజుల పాటూ పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలు, ప్రచారాలు విస్తృతంగా నిర్వహించనున్నారు. ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని దక్షిణ రైల్వే జీఎం ఆర్‌ఎన్ సింగ్ ప్రారంభించారు. దక్షిణ రైల్వే పరిధిలోని అన్ని ప్రాంతాలలో పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలు విస్తృతం చేయనున్నారు. దక్షిణ రైల్వేలోని అన్ని డివిజన్లు, వర్క్ షాపులలలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. తొలిరోజున స్వచ్చత ప్రతిజ్ఞలు జరిగాయి. ప్రజా అవగాహన వర్క్ షాపులు నిర్వహించారు. ఎన్‌జీఓ, సీఎస్‌ఓలతో విడివిడిగా కార్యక్రమాలు జరిగాయి. గురువారం నుంచి రైల్వే యూనిట్లలో ఆరోగ్య శిబిరాలు, భద్రతా పరంగా కార్యక్రమాలు, మారథాన్‌లు,సైక్లోథాన్‌లు, వాక్‌థాన్‌లు నిర్వహించనున్నారు. స్వచ్చ భారత్ మిషన్ స్పోర్ట్స్ లీగ్, ప్లాంటేషన్ డ్రైవ్, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, ఇంటింటికి అవగాహన కార్యక్రమాలు, శ్రమదానం, స్వచ్చ ఆహార కార్యక్రమాలు, రైల్వే స్టేషన్ల లో ప్రత్యేక డ్రైవ్, సాంస్కృతిక ఉత్సవాలు, పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆర్‌ఎన్ సింగ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలోఅదనపు జీఎం (ఇన్‌చార్జ్) సురేష్ పిళ్లై, ప్రిన్సిపల్ హెడ్‌లు, అధికారులు పాల్గొన్నారు.
బాణసంచా పేలుడు
సాక్షి, చైన్నె: విరుదునగర్ జిల్లా వెంబకోట్టై తాలుకాలోని గంగర్షవల్ గ్రామంలో బాణసంచా పరిశ్రమలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో గౌరి(50) ఘటనా స్థలంలోనే మరణించారు. శివకాశి ఆస్పత్రిలో కాళిముత్తు, జయలక్ష్మి, కుమరేషన్ శివరంజనీ, మారియమ్మాల్‌తో పాటూ ఆరుగురు తీవ్ర గాయాలతో చికిత్సలో ఉన్నారు. మరి కొందరు మహిళలు స్వల్పగాయాల పాలయ్యారు. ఈ ప్రమాద సమాచారంతో అధికారులు ఉరకలు పరుగులతో మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయ పడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్‌సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబానికి రూ.4 లక్షలు, గాయపడ్డ వారికి తలా లక్ష, స్వల్ప గాయాల పాలైన వారికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.