పారిశ్రామిక వాడలు.. | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక వాడలు..

Sep 17 2025 7:49 AM | Updated on Sep 17 2025 7:49 AM

పారిశ

పారిశ్రామిక వాడలు..

● సీఎం సమక్షంలో ఫ్రాన్స్‌తో ఒప్పందం ● కళాకారులకు పూంబుహార్‌ అవార్డుల ప్రదానం ● మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు ● నాలుగు పారిశ్రామిక వాడలు

● సీఎం సమక్షంలో ఫ్రాన్స్‌తో ఒప్పందం ● కళాకారులకు పూంబుహార్‌ అవార్డుల ప్రదానం ● మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు ● నాలుగు పారిశ్రామిక వాడలు

సాక్షి, చైన్నె : పర్యాటకంగా దేశంలో రెండో స్థానంలో తమిళనాడు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థికవృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రత్యేక పర్యాటక పాలసీని అమలు చేస్తూ వస్తున్నారు. అర్హతలు, ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు అందించడంతో పాటూ పర్యాటక రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, భాగస్వామ్యం దిశగా చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితులలో ఫ్రాన్స్‌ – తమిళనాడు మధ్య సాంస్కృతిక , పర్యాటక అంశాలకు సంబంధించిన ఒప్పందాలు సచివాలయంలో ఉదయం జరిగాయి. సీఎం స్టాలిన్‌ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందాల మేరకు తమిళనాడు, ప్రాన్స్‌కు చెందిన కళాకారుల మధ్య అవగాహన సాంస్కృతిక మార్పిడి, సాంస్కృతిక ఏకీకరణ ప్రాజెక్టులను అమలు చేయనున్నారు. పరస్పర సహకారంతో కార్యక్రమాలు విస్తృతం చేయడానికి నిర్ణయించారు. సాంస్కృతిక, చారిత్రక, సహజ వారసత్వ పరిరక్షణ, పర్యాటక నిపుణులను తీర్చిదిద్దడం, కళాకారులకు నైపుణ్యాల శిక్షణ, పర్యాటకం, కళ .సంస్కృతి, పురావస్తు శాస్త్రం, వారసత్వం పరిరక్షణ, మ్యూజియంల రంగంలో శిక్షణ సంస్థలకు సహకారాన్ని ప్రోత్సహించడం దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరిలోని ఫ్రాన్స్‌ రాయబారి ఎటియన్‌ రోలాండ్‌ పీగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, పర్యాటక కార్యదర్శి క్రిస్తు రాజ్‌, పర్యాటక శాఖతో ఒప్పందాలు చేసుకున్న ప్రాన్స్‌కు చెందిన సెంటర్‌–వాల్‌ డి లోయిర్‌ ప్రాంతీయ ప్రతినిధులు, ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.

కళాకారులకు అవార్డులు...

సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో 10 మంది కళాకారులకు పూంబుహార్‌ అవార్డులను సీఎం స్టాలిన్‌ అందజేశాారు. అలాగే, 65 ఏళ్లు పైబడ్డ మరో ఏడుగురు కళాకారులకు ‘లివింగ్‌ క్రాఫ్ట్‌ ట్రెజర్‌ అవార్డులను అందజేశారు. 2024–2025 సంవత్సరానికి ‘లివింగ్‌ క్రాఫ్ట్‌ ట్రెజర్‌‘అవార్డులను ఎన్‌. రాణి విన్సెంట్‌, (సహజ ఫైబర్‌ ఉత్పత్తులు) కె.పి. వీజినాథన్‌ (మెటల్‌ షీట్‌ వర్క్‌), ఇళవరసి చోకర్‌ (మ్యూరల్‌ పెయింటింగ్‌), కుప్పు సుబ్రమణి(రాతి శిల్పం), కన్యాకుమారికి చెందిన టి రమణి(క్లాత్‌ పెయింటింగ్‌), ఎన్‌ పూవమ్మాల్‌, , ఎన్‌ దురై రాజ్‌ ( చెక్క శిల్పం)అందుకున్నారు. వీరికి తలా రూ. ఒక లక్ష నగదు , బంగారు పతకం అందజేశారు. అలాగే, 2024–2025 సంవత్సరానికి పూంబుహార్‌ అవార్డును జె. వెంకట్రామన్‌ (పంచలోహ శిల్పం), రమేష్‌ (తంజావూర్‌ పెయింటింగ్‌), ఎం. కుప్పుసామి (తంజావూర్‌ పెయింటింగ్‌), టి. గోపాలకృష్ణన్‌ (చెక్క చెక్కడం), కె. మురుగన్‌ (చెక్క శిల్పం) రావు హరికృష్ణన్‌ (సైకత శిల్పం) ఎస్‌. రహమత్‌ మిరాల్‌ బీవి ( నేత వస్త్రాలపై అద్బుతాలు ) సి. శ్రీ కుమారి (సహజ ఫైబర్‌ వస్తువుల తయారీ ) పా. మెహంత్‌ (నెయిల్‌ థ్రెడ్‌ ఆర్ట్‌) గోకుల్‌ నాథన్‌లకు అందజేశారు. వీరికి బంగారు పతకం , రూ. 50 వేలు నగదు బహుమతి, రాగి ప్రశంసా పత్రం, సర్టిఫికెట్లు అందజేశారు

ప్రోత్సాహం..

తమిళనాడు వక్ఫ్‌ బోర్డు తరపున అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చదువుతున్న మైనారిటీ విద్యార్థుల కోసం విద్యా స్కాలర్‌షిప్‌ పథకాన్ని సీఎం స్టాలిన్‌ సచివాలయంలో ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులలో ఉండే మైనారిటీ విద్యార్థులు అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలకు అర్హుత కల్పించే విధంగా , గ్రాడ్యుయేట్‌ విద్యను అభ్యసించడానికి ఈ స్కాలర్‌షిప్‌ దోహదకరంగా ఉంటుందని ప్రకటించారు. డిగ్రీ చదువుకునేందుకు వీలుగా తమిళనాడు వక్ఫ్‌ బోర్డు తరపున విద్యార్థులకు రూ. 2 వేలు, పోసు్ట్రగాడ్యుయేట్‌ విద్యార్థులకు రూ. 10 వేలు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాజర్‌, ఎంపీ నవాజ్‌ ఖని తదితరులు పాల్గొన్నారు.

తమిళనాడు చిన్న తరహా పరిశ్రమల శాఖనేతృత్వంలో రూ. 67.34 కోట్ల అంచనా వ్యయంతో 4 కొత్త పారిశ్రామిక వాడలు, రెండు ప్రైవేటు పారిశ్రామిక వాడులు, పారిశ్రామిక ఎస్టేట్‌లు, మురుగునీటి మురుగునీటి శుద్ధి కర్మాగారం, ప్రజా సౌకర్యాల కేంద్రాలను సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. రూ. 78.57 కోట్లతో కార్మికులకు వసతి గృహాలు, వ్యవసాయ వస్తువుల ఉత్పత్తితో పాటూ 18 పారిశ్రామిక వాడలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నారు. ఈ పనులకు సీఎం స్టాలిన్‌ సచివాలయం నుంచి ఉదయం శంకుస్థాపన చేశారు. అలాగే సిట్కో అసిస్టెంట్‌ మేనేజర్‌ పదవికి ఎంపికై న వారికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. కడలూరు జిల్లాలోని మారుతాడ్‌లో రూ. 3.60 కోట్ల అంచనా వ్యయంతో ఓ పారిశ్రామిక వాడ, కోయంబత్తూరు జిల్లాలో 11.57 ఎకరాల్లో కొత్త ప్రైవేట్‌ పారిశ్రామిక వాడ, కిట్టంపాళయం అన్నా కోఆపరేటివ్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ వద్ద రూ.24.61 కోట్ల విలువైన ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన, కాంచీపురం జిల్లాలోని తిరుముడివక్కం ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో రూ. 2.60 కోట్లు, నామక్క్‌ జిల్లా తిరుచెంగోడ్‌లో రూ. 8.20 కోట్లతో పూర్తి చేసిన పుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాలను సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రులు ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, అన్బరసన్‌, సీఎస్‌ మురుగానందం, తదితరులు పాల్గొన్నారు.

పారిశ్రామిక వాడలు.. 1
1/1

పారిశ్రామిక వాడలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement