
కూటమి బలోపేతానికి వ్యూహాలు
సాక్షి, చైన్నె: బీజేపీ– అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి బలోపేతం దిశగా నేతలు వ్యూహాలకు పదును పెట్టారు. ఈ మేరకు బీజేపీ సెంట్రల్ కమిటీ భేటీలో మంగళవారం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అధ్యక్షతన ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశం ఉదయం జరిగింది. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అరవింద్‌మీనన్, కో ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నేతలు తమిళి సై సౌందరరాజన్,పొన్ రాధాకృష్ణన్, హెచ్ రాజ, శరత్‌కుమార్, వానతీ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీలోని 26 విభాగాలకు చెందిన అధ్యక్షులతో పాటూ 70 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.కూటమిలోకి మరిన్ని పార్టీలను ఆహ్వానించడం, బయటకు వెళ్లిన వారిని మళ్లీ అక్కున చేర్చుకునే దిశగా ఈసమావేశంలో వ్యూహాలకు పదును పెట్టి చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, పార్టీ పరంగా పట్టున్న అసెంబ్లీ నియోజక వర్గాలలో కార్యక్రమాలను విస్తృతం చేయడానికి సిద్ధమయ్యారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ బర్త్‌డేను కోలాహాలను నిర్వహించడం, ర్యాలీలు వంటి కార్యక్రమాలకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల ఎంపిక గురించి ఇందులో చర్చించి ఉన్నారు. అన్నాడీఎంకేకు పట్టున్న స్థానాలే ఇందులోఅధికంగా ఉన్నట్టు సమాచారా. ఈ స్థానాలలో పార్టీ పరంగా కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు దరిచేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. కాగా కూటమిలో గందరగోళం అన్నది చోటు చేసుకోకుండా నేతలందరూ సమన్వయంతో ముందుకు సాగే విధంగా, అన్నాడీఎంకే వర్గాలతో విభేదాలకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకునే రీతిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు నేతలకు ఇన్‌చార్జ్‌లుపలు సూచనలు, సలహాలు ఇచ్చినట్టు సమాచారాలు వెలువడ్డాయి.

కూటమి బలోపేతానికి వ్యూహాలు