
ఘనంగా ఓజోన్ దినోత్సవం
కొరుక్కుపేట: స్థానిక పట్టాభిరామ్‌లోని ధర్మమూర్తిరావు బహదూర్ కల్వల కన్నన్ చెట్టి హిందూ కళాశాలలో, సెంటర్ ఫర్ కై ్లమేట్ లిటరసీ అండ్ క్యాంపెయిన్ (సీసీఎల్‌సీ) ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అధ్యాపకులు, విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి భారత వాతావరణశాఖ ప్రాంతీయ వాతావరణ కేంద్రం, చైన్నె దక్షిణ ప్రాంతం విభాగం పూర్వ అధిపతి డాక్టర్ ఎస్. బాలచంద్రన్ హాజరయ్యారు. కళాశాల కార్యదర్శి ఎం. వెంకటేశపెరుమాళ్ అధ్యక్షతన, పరిశోధన అభివృద్ధి కేంద్రం సంచాలకుడు డాక్టర్ ఎన్. రాజేంద్రనాయుడు, కై ్లమేట్ లిటరసీ అండ్ క్యాంపెయిన్ విభాగం కన్వీనర్ డాక్టర్ ఆర్. రాఘురామ్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం డాక్టర్ బాలచంద్రన్ అధ్యాపకులు, విద్యార్థులతో ఓజోన్ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పోస్టర్ రూపకల్పన పోటీలో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, నగదు బహుమతులు ప్రదానం చేశారు. కళాశాల పూర్వ విద్యార్థి డి.శఠగోపన్ పాల్గొన్నారు.