
యఽథావిధిగా సుబ్రహ్మణ్యస్వామి దర్శనం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం యథావిధిగా ఆలయంలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అనేక ఆలయాలు మూతపడ్డాయి. అయితే అందుకు భిన్నంగా తిరు త్తణి ఆలయం ఆగమ శాస్త్రం మేరకు గ్రహణం సమయంలోనూ ఆలయం తెరిచివుంచి భక్తులు స్వామిదర్శనం చేసుకోవడం పరిపాటి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం యథావిధిగా ఆలయం తెరిచి స్వామికి అభిషేక పూజలు నిర్వహించారు. ఆదివా రం సెలవుదినం కావడంతో భక్తులు అధికసంఖ్య లో స్వామి దర్శనం చేసుకున్నారు. అనేక ఆలయా లు సాయంత్రం మూతపడినప్పటికీ, తిరుత్తణి ఆలయంలో మాత్రం నిర్విరామంగా భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం స్వామికి ఏకాంత సేవ చేశారు.

యఽథావిధిగా సుబ్రహ్మణ్యస్వామి దర్శనం