
టెట్ పరీక్ష రాయాల్సిన టీచర్ల వివరాల సేకరణ ముమ్మరం
తిరువొత్తియూరు: సుప్రీంకోర్టు ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) విషయంలో సంచలన తీర్పును వెలువరించింది. అందులో 2012కి ముందు విధుల్లో చేరిన ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొంది. ఈ ఉత్తర్వుల వల్ల, తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,38,000 మంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలల్లో 38,000 మంది ఉపాధ్యాయులు సహా మొత్తం 1,76,000 మంది టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని ప్రాథమికంగా సమాచారం వెలువడింది. ఈ విషయంలో పాఠశాల విద్యాశాఖ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చలు జరుపుతున్న నేపథ్యంలో, ’టెట్’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిన ఉపాధ్యాయుల వివరాలను కచ్చితంగా సేకరించాలని ప్రణాళిక వేసింది. దాని ప్రకారం, ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన ఉపాధ్యాయుల వివరాలు, ఉత్తీర్ణత సాధించాల్సిన ఉపాధ్యాయుల వివరాలను సేకరించి, పాఠశాల విద్యాశాఖకు ఆయా జిల్లా ముఖ్య విద్యాధికారులు పంపాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అంధుల కారు ర్యాలీ