
భక్తులతో గిరివలయం కిటకిట
వేలూరు: భక్తులతో గిరివలయం కిటకిటలాడింది. తిరువణ్ణామలై గిరివలం వెళ్లేందుకు భక్తులకు అవసరమైన సౌకర్యాలను ట్రాన్స్‌పోర్టు అధికారులు సిద్ధం చేశారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ఆలయం వెనుక ఉన్న కొండను 14 కిలోమీటర్లు నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అందులో భాగంగా ఆదివారం నుంచి అర్ధరాత్రి వరకు పౌర్ణమి సమయం ప్రకటించడంతోపాటు సెలవు రోజు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఉదయం నుంచి భక్తులు తిరువణ్ణామలైకి చేరుకున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ అధికంగా ఉండడంతో రవాణా అధికారులు అదనపు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వీటితోపాటు రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కాట్పాడి చేరుకొని రైలులో తిరువణ్ణామలై చేరుకున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి చంద్రగ్రహణం కావడంతో ఉదయం నుంచే సాయంత్రం వరకు భక్తుల రద్దీ కిటకిటలాడింది భక్తుల రద్దీని బట్టి ఆలయ అధికారులు ఆలయంలో భక్తులకు ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు.