
కన్నులపండువగా చక్రతాళ్వార్‌కు చక్రస్నానం
చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు ఆదివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన చేపట్టారు. అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చక్రత్తాళ్వార్‌ను పల్లకీపై ఊరేగింపుగా పద్మ పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. దీంతో పవిత్రోత్సవాలను పరిసమాప్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజు, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

కన్నులపండువగా చక్రతాళ్వార్‌కు చక్రస్నానం