
వైభవం..వీరరాఘవుడి పవిత్రోత్సవం
తిరువళ్లూరు: పట్టణంలోని వైద్య వీరరాఘవుడి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం ఉదయం తిరుమంజనం, యాగశాల పూజలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిఏటా వైద్యవీరరాఘఽవుడి ఆలయంలో పవిత్రోత్సవాలను ఏడు రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం, అలంకరణ, తిరుమంజనం, యాగశాల పూజలు, ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. కాగా పవిత్రోత్సవాలు 13వ తేదీన ముగియనున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వైభవం..వీరరాఘవుడి పవిత్రోత్సవం