
చిరుత దాడిలో దూడ మృతి
వేలూరు: చిరుత దాడిలో దూడ మృతిచెందింది. వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని అంబుకాల్ గ్రామానికి చెందిన రంగన్ ఇతను పది ఆవులు, దూడలను పెంచుకుంటున్నాడు. ఈక్రమంలో గురువారం పశువులను మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటి సమీపంలోని గుడిసెలో కట్టి ఇంట్లో నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున దూడతో పాటు పశువులు ఉన్న ఫలంగా అరవడంతో రంగన్ ఇంటి నుంచి బయటకు వచ్చి చూశాడు. ఆ సమయంలో వింత శబ్దం వినపడడంతో విద్యుత్ సరఫరా లేక చీకటిగా ఉండడంతో కేకలు వేశాడు. వెంటనే చుట్టుపక్కల వారు అక్కడిక చేరుకొని చూడగా ఆ సమయంలో చిరుత దూడను చంపి అక్కడ నుంచి లాక్కెళ్లడాన్ని చూశారు. వెంటనే చిరుతను తరిమేందుకు మంటలు వేసి కేకలు పెట్టడంతో చిరుత అక్కడ నుంచి పరుగులు తీసింది. అక్కడకు వెళ్లి చూడగా అప్పటికే దూడ మృతిచెంది ఉండడాన్ని గమనించి పోలీసులకు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు.