
గురువులను పూజించాలి
కొరుక్కుపేట: గురువులను అనునిత్యం పూజించాలి సభలో పాల్గొన్న వక్తలు వ్యాఖ్యానించారు. జనని సాంఘిక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చైన్నె వ్యాసార్పాడి ఎంకేబీనగర్‌లోని జనని సంస్థ ప్రధాన కార్యాలయంలో సర్వేపల్లి చిత్రపటానికి జనని అధ్యక్షులు డాక్టర్ నిర్మల, ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో డాక్టర్ మనోజ, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ విస్తాలి శంకరరావు, శోభ, ఎర్రభనేని పట్టాభి రామయ్య, తమ్మినేని బాబు నివాళులర్పించారు.