
సర్వేపల్లికి ఘన నివాళి
వేలూరు: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత గురువులపై ఉందని తమిళనాడు రిటైర్డ్ పాఠశాల, కళాశాల టీచర్స్ అసోషియేషన్ జిల్లా ఆర్గనైజర్ జనార్దన్ అన్నారు. వేలూరు టీచర్స్ భవనంలో ఆ సంఘం ఆధ్వర్యంలో టీచర్‌ల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్తమ టీచర్‌లను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురువుగా విద్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన ఆదర్శనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణ జయంతి దినోత్సవం రోజున గౌరవించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమాజంలోని ప్రతిఒక్కరినీ బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. ప్రభుత్వం టీచర్‌లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. మెడికల్ అలవెన్స్ అందజేయాలని, 80 సంవత్సరాలు దాటిన టీచర్‌లకు 20 శాతం పెన్షన్ పెంచాలని, డిమాండ్ చేశారు. రిటైర్డ్ టీచర్‌లు గోపాల క్రిష్ణన్, ఆర్ముగం, రఘునాథ్, ఉమ, జయలక్ష్మి, శశికుమారి, వినాయకం పాల్గొన్నారు.