ప్లస్‌టూ విద్యార్థినిపై లైంగిక దాడి | - | Sakshi
Sakshi News home page

ప్లస్‌టూ విద్యార్థినిపై లైంగిక దాడి

Sep 6 2025 5:23 AM | Updated on Sep 6 2025 5:23 AM

ప్లస్‌టూ విద్యార్థినిపై  లైంగిక దాడి

ప్లస్‌టూ విద్యార్థినిపై లైంగిక దాడి

తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లా కులచల్‌ పాలపల్లం సమీపంలోని నీర్వక్కులి గ్రామానికి చెందిన థనీస్‌(25) అతను కరుకల్‌ చెలంగ్‌ కోణం రోడ్డులో వెల్డింగ్‌ దుకాణం నడుపుతున్నాడు. పాలపల్లం సమీపంలోని ఒక గ్రామానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థిని టైప్‌ రైటింగ్‌ నేర్చుకోవడానికి ఆ ప్రాంతానికి వస్తుంది. ఆ సమయంలో విద్యార్థినితో థనీస్‌ మాట్లాడుతూ ఇద్దరూ స్నేహితులుగా మారారు. గత జూలై 4, 5వ తేదీలలో థనీస్‌ బాలికను బైక్‌పై వలుదళం పల్లంలోని ఒక ప్రైవేట్‌ పాఠశాల వెనుకకు తీసుకెళ్లాడు. అక్కడ అతను బాలికపై లైంగిక దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి దిగ్భ్రాంతి చెందారు. ఆమె వెంటనే కులచల్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గురువారం అలంజిలో థనీస్‌ను అరెస్టు చేశారు. తరువాత అతన్ని పోక్సో కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు.

వైద్య విద్య ర్యాంకుల

జాబితా విడుదల

తిరువొత్తియూరు: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్య విద్య ప్రవేశానికి కౌన్సెలింగ్‌ పూర్తి చేసి విద్యార్థులు కళాశాలల్లో చేరారు. నీట్‌ మార్కుల ఆధారంగా ఈ కౌన్సెలింగ్‌ జరిగింది. ఆతర్వాత సిద్ధ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, యోగా ప్రకృతి వైద్య డిగ్రీ కోర్సుల ర్యాంకు జాబితా శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. దీనిని ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ విడుదల చేశారు. నీట్‌ కటాఫ్‌ మార్కుల ఆధారంగా విద్యార్థుల ర్యాంకు జాబితా తయారుచేసి విడుదల చేశారు.

పేకాటరాయుళ్లు

ఆరుగురి అరెస్ట్‌

సేలం: పేకాటాడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెరియసేమూర్‌ సమీపంలోని కల్లంగడు వాగు సమీపంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు వీరప్పన్‌చత్రం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ స్థావరంపై పర్యవేక్షించి దాడి చేసి పేకాటాడుతున్న ఆరుగురిని పట్టుకున్నారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.

75 బస్తాల బియ్యం స్వాధీనం

వడమాలపేట (పుత్తూరు): ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి, 75 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ధర్మారెడ్డి కథనం మేరకు.. అక్రమ రవాణా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి వడమాలపేట మండలం, తడుకు రైల్వే స్టేషన్‌ క్రాస్‌ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఏపీ 39 డబ్ల్యూడీ 5318 నెంబరు గల బొలేరో లగేజ్‌ వెహికల్‌ను ఆపి తనిఖీ చేయగా అందులో 50 కేజీల బరువు గల 75 బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాగలాపురం మండలం, బీరకుప్పం గ్రామానికి చెందిన దినేష్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ.1.35 లక్షలు ఉంటుందని లెక్కగట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సర్వ దర్శనానికి

24 గంటలు

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు నిండాయి. క్యూ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 59,834 మంది స్వామి వారిని దర్శించుకోగా 24,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement