
విద్య సేవమ్ సమ్మాన్ అవార్డులు ప్రదానం
కొరుక్కుపేట: చైన్నె, గోపాలపురంలోని డీఏవీ బాలికల సీనియర్ సెకండరీ స్కూల్‌లో లయన్‌న్స్ క్లబ్ ఆఫ్ మీనంబాక్కం, మిషన్ గురు దేవో భవ సంయుక్తంగా తొలి విద్యా సేవా సమ్మాన్ అవార్డులు –2025 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 20 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ను అవార్డులతో ఘనంగా సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఇరైఅన్బు అవార్డులను ప్రదానం చేశారు. ప్రతి అవార్డు గ్రహీతకు రూ.21వేల నగదు బహుమతి లభించింది. విద్యా శంకర్ చక్రవర్తి, స్కూల్స్ డైరెక్టర్ శాంతి, మిషన్ గురు దేవో భవ సహ వ్యవస్థాపకుడు లెఫ్టినెంట్ అనిల్ ఖిచా, లయన్స్ క్లబ్ ఆఫ్ మీనంబాక్కం అధ్యక్షుడు బాలాజి పాల్గొన్నారు.