
మాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కధీర్
తమిళ సినిమా: సరిహద్దులు దాటి చాలా కాలమే అయింది. ముఖ్యంగా తమిళ నటీనటులు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కమలహాసన్ శరత్ కుమార్ వంటి పలువురు నటులకు మాలీవుడ్ లో మంచి పేరు ఉంది. కాగా తాజాగా యువ నటుడు కధిర్ కూడా మాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈయన తమిళంలో పరియేరుం పెరుమాళ్ చిత్రంలో కథానాయకుడిగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు అదేవిధంగా సుళల్ వెబ్ సిరీస్‌లో పోలీస్ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. విక్రమ్ వేద వంటి హిట్ చిత్రాలు నటించిన ఖదీర్ ఇప్పు డు మలయాళంలో మీషా అనే చిత్రంలో కథానాయకుడిగా నటించారు. యూనికార్న్ మూ వీస్ పతాకంపై సర్జరీ గఫూర్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల ఒకటో తేదీన మలయాలతో పాటూ తమిళంలోనూ విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇది ముగ్గురు మిత్రుల ఇతివృత్తాంతంతో సాగే సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథాచిత్రంగా రూపొందింది. ముఖ్యంగా నటుడు కధీర్ తన సామాజిక వర్గం హక్కుల కోసం, వారి శ్రేయస్సు కోసం పోరాడే విప్లవ యువకుడి పాత్రలో నటించారు. తనను నమ్మిన వారికోసం ప్రాణాలు అర్పించడానికి అయిన సిద్ధపడే ఉదాత్తమైన పాత్రలో కధీర్ లీనమై నటించాడనే చెప్పవచ్చు. అధిక భాగం ఆటవీ ప్రాంతంలో జరిగే ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటాయి. స్నేహ బంధం రాజకీయాలు కలగలిపిన ఈ చిత్రంలోని కధీర్ నటన పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంటోంది. తొలి చిత్రంతోనే మలయాళంలో జెండా పాతిన కధీర్ అక్కడి సిని ప్రముఖుల దృష్టిలో పడ్డారు.