
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి
వేలూరు: దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని నిరసనగా అన్ని పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట మానవహారం నిర్వహించి ఆందోళన చేశారు. ఈసందర్భంగా ప్రభుత్వ ఒకేషనల్ టీచర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన మాట్లాడుతూ కొత్త పింఛన్ పథకాన్ని రద్దుచేసి, పాత పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కోసం పెన్షనర్లు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం లేదన్నారు. అదేవిధంగా పెన్షనర్లకు మెడికల్ అలవెన్స్, వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పన్నీర్‌సెల్వం, కార్యదర్శి లోకనాథం, కోశాధికారి అహ్మద్, పెన్షనర్లు పాల్గొన్నారు.