
రూ.18 కోట్ల వస్తువుల రికవరీ
తిరువళ్లూరు: ఆవడి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 28 పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులను ఛేదించిన పోలీసులు రూ.18 కోట్ల విలువ చేసే బంగారు, వెండి వస్తువులు, నగదును రికవరీ చేసి బాధితులకు కమిషనర్ శంకర్ అప్పగించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 28 పోలీసుస్టేషన్‌లు వున్నాయి. గత ఆరు నెలల కాలంలో చోరీలు, స్నాచింగ్, మోసాలపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. వీటిని పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన వ్యక్తుల నుంచి 87 సవర్ల బంగారు నగలు, 922.989 కిలోల వెండి, రూ.3.96 లక్షల నగదు, 317 సెల్‌ఫోన్‌లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, 90 ఏసీలతో పాటు వస్తువులను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. నకిలీ డాక్యుమెంట్‌లను సృష్టించి మోసాలకు పాల్పడిన సంఘటనలపై 16 కేసులు నమోదు చేసి రూ.6.89 కోట్ల ఆస్తులను రికవరీ చేశారు.
● బాధితులకు అప్పగించిన
ఆవడి పోలీసు కమిషనర్