క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jul 12 2025 8:24 AM | Updated on Jul 12 2025 10:01 AM

క్లుప

క్లుప్తంగా

రైల్లో మహిళ నగలు చోరీ

అన్నానగర్‌: రైల్లో ఓ మహిళ నుంచి 17 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. చైన్నెలోని మేడవాక్కం ప్రాంతానికి చెందిన జయరామన్‌. ఇతని భార్య తమిళసెల్వి (27). వీరికి ముగ్గురు కుమారులు. వారికి మదురై జిల్లాలోని తిరుమంగళం కామరాజపురం ఉత్తర ప్రాంతంలో ఇల్లు ఉంది. గతవారం, తమిళసెల్వి చైన్నె నుంచి తిరుమంగళంకు అనంతపురి రైలులో వెళ్లింది. ఆమె బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై గురువారం రాత్రి ముత్తునగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చైన్నెకి తిరిగి వెళ్లింది. ఇంటికి వెళ్లి పర్సు చూడగా 17 సవర్ల బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించింది. రైల్వే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తిరువణ్ణామలై–నరసాపూర్‌ మధ్య ప్రత్యేక రైలు

వేలూరు: ఆంధ్ర రాష్ట్రం నుంచి తిరువణ్ణామలైకి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తిరువణ్ణామలై నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని నరసాపురం వరకు వారాంతపు ప్రత్యేక రైలు నడిపేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో తిరువణ్ణామలై నుంచి తన మొదటి ప్రయాణాన్ని వారాంతపు రైలు గురువారం బయలుదేరింది. తిరువణ్ణామలై నుంచి ఉదయం 11 గంటలకు బయ లుదేరి వేలూరు, కాట్పాడి, చిత్తూరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, బ్రహ్మవరం మీదుగా నరసాపురం రైల్వేస్టేషన్‌కు అర్ధరాత్రి 2 గంటలకు చేరుకుందని రైల్యే అధికారులు తెలిపారు. ఈ వారంతపు ప్రత్యేక రైలు ఈనెల 17, 24, ఆగస్టు మాసంలో 7,14, 21, సెప్టెంబర్‌ 4, 25వ తేదీల్లో ఈ ప్రత్యేక రైలు తిరువణ్ణామలై నుంచి బయలుదేరి నరసాపురానికి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

గిరివలయం రోడ్డులో

భక్తుడి హత్య

ఇద్దరి అరెస్ట్‌

వేలూరు: తిరువణ్ణామలైలో అన్నామలైయార్‌ ఆలయ దర్శనానికి వెల్లి గిరివలయంలో నడిచి వెళుతున్న తెలంగాణ భక్తుడిని హత్య చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ, యాదగిరి జిల్లాలోని సౌందరిపురానికి చెందిన విద్యాసాగర్‌(32) ఈనెల 7న తిరువణ్ణామలైలోని స్వామి వారి దర్శనార్థం వచ్చాడు. 8వ తేదీన రాత్రి అతను అన్నామలైయార్‌ ఆలయం నుంచి గిరివలయం రోడ్డులో నడిచి వెలుతుండగా ఇద్దరు యువకులు బైకులో వచ్చారు. ఆ సమయంలో విద్యాసాగర్‌ను అదుపు తప్పి ఢీకొట్టినట్లు తెలిసింది. దీంతో విద్యాసాగర్‌, ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆగ్రహించిన ఆ యువకులు కత్తితో విద్యాసాగర్‌పై దాడి చేసి పరారిపోయారు. విషయం తెలిసి తిరువణ్ణామలై పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యాసాగర్‌ గురువారం సాయంత్రం మృతిచెందాడు. పోలీసులు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. అనంతరం తిరువణ్ణామలైకి చెందిన గణేశ్వరన్‌, తమిళరసన్‌లను అరెస్ట్‌ చేశారు.

మూడు కార్లు ఢీ:

ఏడుగురికి గాయాలు

తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని జాతీయ రహదారిలో మూడు కార్లు ఢీకొన్న ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి తిరుత్తణి పోలీసుల కథనం మేరకు..చైన్నెకి చెందిన ముకుందన్‌(51), వదరరాజన్‌(53) తిరుమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుని శుక్రవారం మధ్యా హ్నం చైన్నెకి బయలుదేరారు. తిరుత్తణి సమీపం చైన్నె తిరుపతి జాతీయ రహదారిలోని పొన్పాడి రైల్వేస్టేషన్‌ క్రాస్‌ వద్ద తిరుత్తణి సమీపం మురుకంబట్టుకు చెందిన విజయ్‌(29), అన్న విగ్నేష్‌(30) కొత్తూరులో బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కార్లో వెళుతుండగా, తిరుపతి నుంచి చైన్నె వైపు వెళుతున్న కారును ఢీకొని అదుపుతప్పి తిరుపతి నుంచి చైన్నెకి వెళుతున్న మరో కారును సైతం ఢీకొంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా1
1/3

క్లుప్తంగా

క్లుప్తంగా2
2/3

క్లుప్తంగా

క్లుప్తంగా3
3/3

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement