
క్లుప్తంగా
చైన్నె వైద్యుడి నుంచి రూ.2.90 కోట్లు దోచుకున్న ముఠా
– సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు
కొరుక్కుపేట: ముంబై సైబర్ క్రైమ్‌పోలీసు అధికారులుగా నటిస్తూ చైన్నెలో ఓ వైద్యుడినుంచి రూ.2.9 కోట్లు దోపిడీ చేసిన ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు సోదిస్తున్నారు. వివరాలు.. ముంబాయ్ సైబర్ క్రైమ్ పోలీసు డివిజన్ నుంచి వచ్చినట్టు చెప్పుకుని ఓ రహస్య ముఠా చైన్నె కు చెందిన ఒక వైద్యుడిని సంప్రదించారు. కేసు పెడతామని బెదిరించి వారి నుంచి రూ.2.90 కోట్లు లాగేసుకున్నారు. అంతలోనే మోస పోయానని గ్రహించిన వైద్యుడు జరిగిన దాని ని అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తోంది.
విద్యార్థినులకు లైంగిక వేధింపులు
– ప్రభుత్వ టీచర్ అరెస్ట్
తిరువొత్తియూరు: ఓమలూరు సమీపంలో ఐదుగురు విద్యార్థినుల వద్ద అసభ్యంగా ప్రవర్తించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సేలం జిల్లాలోని ఓమలూరు సమీపంలోని కడైయంపట్టి గ్రామంలోని పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్‌లో 4 ,5 తరగతులు చదువుతున్న ఐదుగురు విద్యార్థినులపై తరగతి ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు అందింది. విద్యార్థుల ఫిర్యాదుపై ప్రధానోపాధ్యాయుడు దర్యాప్తు నిర్వహించారు. ఆ ఉపాధ్యాయుడు 9, 10 సంవత్సరాల బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడని తెలిసింది. దీని తరువాత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓమలూరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ శశికళ నేతృత్వంలోని పోలీసులు దర్యాప్తు నిర్వహించి, విద్యార్థులను వేధించిన తిరునెల్వేలిలోని వడక్కన్ పట్టికి చెందిన పాఠశాల ఉపాధ్యాయుడు తంగవేల్ (43)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం ఆ టీచర్ తంగవేలు అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.
వృద్ధురాలిని
గొంతు కోసి చంపి..
– 5 సవర్ల నగలు చోరీ
అన్నానగర్: తిరుచ్చి జిల్లా, మనప్పారై, వైయంపట్టి యూనియన్, పెరియకులంపట్టి గ్రామానికి చెందిన, కులందై థెరెసు (65). ఈమె కుమారుడు సౌరిముత్తు తిరుచ్చిలో, కుమార్తె జెబామాలైమెరి సమీపంలోని ముగవనూర్ లో నివసిస్తున్నారు. దీని కారణంగా, కులందై థెరసు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈమె 100 రోజుల పనికి, కూలీ పనికి వెళ్లేది. ఈమె సాధారణంగా రాత్రిపూట ప్రాంగణంలో, తలుపు వద్ద తాడు మంచం మీద పడుకుంటుంది. శుక్రవారం రాత్రి ఆమె ప్రాంగణంలో ఓ మంచం మీద పడుకుంది. శనివారం ఉదయం ఈమె శరీరం నుంచి రక్తం కారుతున్నట్లు చూసిన స్థానికులు సమీపంలోకి వెళ్లి చూడగా గొంతు కోసి పడి ఉన్న కులందై థెరసును చూశారు. ఆమె ధరించిన 5 సవర్ల నగలు కనిపించలేదు. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కులందై థెరసు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. విచారణ లో వద్దురాలిని గొంతు కోసీ హత్య చేసి 5 సవర్ల నగలు చోరీ చేసుకుని పరారైనట్లు తెలిసింది. అనంతరం కేసు నమోదు చేసిన పోలిసులు, హంతకుడిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
హత్య కేసులో నలుగురి అరెస్ట్
తిరువొత్తియూరు: మద్యం మత్తులో ఏర్పడిన గొడవలో స్నేహితుడి తలపై బండరాయి వేసి హత్య చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దిండిగల్ జిల్లా వత్తులగుండు మదురై వెళ్లే మెయిన్ రోడ్‌లో ఆర్టీఓ కార్యాలయం వద్ద శనివారం ఉదయం ఐదుగురు మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో ఐదుగురిలో నలుగురు కలిసి ఒకరి గొంతు నులిమి తలపై రాయి వేసి హత్య చేసి పారిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో హత్యకు గురైన వ్యక్తి మదురై జైహింద్‌పురానికి చెందిన రౌడీ శివమణి తెలిసింది. హత్య చేసిన ఇతని స్నేహితులు మణికంఠన్, అరుల్‌మణి, సూర్య మునస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు.
ప్రేమ పేరుతో మోసం
–యువకుడి అరెస్ట్
తిరుత్తణి: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్న యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తిరుత్తణికి చెందిన యువతి డిగ్రీ చదివి ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. యువతి, తెక్కళూరు దళితవాడకు చెందిన ఇన్బరాజ్(27) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతి సంపాదించిన డబ్బును ఇన్బరాజ్ తీసుకున్నాడు. ఈక్రమంలో వారం రోజుల క్రితం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో మోసం చేసిన ఇన్బరాజ్‌పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు తిరుత్తణి మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ మలర్ ఇన్బరాజ్‌ను అరెస్టు చేశారు.