
దినేష్ అన్నీ ఉన్నాయి
అవకాశాల వేటలో ప్రియాంక
తమిళసినిమా: ఒక్కోసారి సక్సెస్‌ఫుల్ నటి అని ముద్ర వేసుకున్నా అవకాశాలు ముఖం చాటేస్తుంటాయి. నటి ప్రియాంక మోహన్ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఈ కన్నడ భామ మాతృభాషతో పాటు తెలుగు, తమిళం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె 2019లో కన్నడ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగులో నాని గ్యాంగ్‌లీడర్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఆ చిత్రం ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్, డాన్ చిత్రాల్లో వరుసగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. అంతేకాకుండా గ్లామర్‌కు దూరంగా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఇలా సూర్యతో ఎదర్కుమ్ తుణిందవన్, ధనుష్ సరసన కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఆ మధ్య తెలుగులో నాని సరసన సరిపోదా శనివారం చిత్రంలో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటిది ఆ తరువాత అవకాశాలు కరువయ్యాయి. నటుడు ధనుష్ దర్శకత్వం వహించి నిర్మించిన నిలవుక్కు ఎన్‌మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. అంతే ఆ తరువాత తమిళంలో మరో అవకాశం రాలేదు. తెలుగులోనూ ఓజీ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. దీంతో మడి కట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఉండదని గ్రహించారో ఏమోగానీ గ్లామర్‌కు తెర రేపింది. తాజాగా వివిధ భంగిమల్లో ఫొటోలు తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అందులో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు చోటు చేసుకున్నాయి. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా ప్రియాంకమోహన్ అవకాశాల వేట మొదలుపెట్టారన్నమాట.
తమిళసినిమా: రబేకింగ్ పాయింట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రం యాదుమ్ అరియాన్. ఎం.గోపి కథ దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ పత్రికాధినేత దినేష్ కథానాయకుడుగా పరిచయం అయ్యారు. నటి ప్రణనైతిక రచించిన ఈ చిత్రంలో విజయ్ టీవీ ఫేమ్ కేపీవై ఆనంద్ పాండి శ్యామన్, అప్పుకుట్టి ముఖ్యపాత్రలు పోషించారు. ఈచిత్రం ఈనెల 18న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. దర్శకుడు పేరరసు, స్టంట్ మాస్టర్ కణలచ కన్నన్, సౌందరరాజన్, పత్రికల సంఘం అధ్యక్షుడు టీఎస్ సుభాష్, దర్శకుడు ఈవీ.గణేష్, సంపత్‌రామ్ పాల్గొన్నారు. పేరరసు మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్న దినేష్ ఒక పత్రిక అధినేత కుటుంబానికి చెందిన వారిని పేర్కొన్నారు. ఆయనలో నటుడికి కావాల్సిన లక్షణాలని పుష్కలంగా ఉన్నాయన్నాన్నారు. ఇంతకుముందు కాదల్ మన్నన్ ( ప్రేమ రారాజు)గా జెమిని గణేశన్, ఆ తర్వాత కాదల్ ఇళవరసన్ ప్రేమ యువరాజు)గా కమలహాసన్ ఉండేవారన్నారు. ఆ తరువాత ఎవరూ లేరని, ఇప్పుడు ఆస్థానాన్ని దినేష్ పూర్తిచేయడానికి వచ్చినట్టు తెలుస్తోందన్నారు. ఈ చిత్ర దర్శకుడు విజయ్‌కి వీరాభిమాని అని అందుకే ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ విజయ్ అభిమానులు అయి ఉండాలని భావించి ఉంటారన్నారు. ఈ చిత్రంలో కూడా విజయ్‌కు సంబంధించిన సన్నివేశాలను పొందుపరిచారని చెప్పారు.

దినేష్ అన్నీ ఉన్నాయి