
కాదల్‌లా సక్సెస్ కావాలి
తమిళసినిమా: శ్రీ కృష్ణ ప్రొడక్షన్‌న్స్ పతాకంపై మౌళి ఎం.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ఉసురే. అసలు చిత్రం ఫేమ్ టీజే అరుణాచలం బిగ్‌బాస్ ఫేమ్ జనని జంటగా నటించిన విచిత్రం ద్వారా నటి మంత్ర (తెలుగులో రాశీ) ముఖ్యపాత్రలో రీ ఎంట్రీ అయ్యారు. నవీన్ ది గోపాల్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రానికి కిరణ్ జోష్ సంగీతాన్ని, మార్కీ సాయి చాయాగ్రహణం అందించారు. నిర్మల్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు ఒకటవ తేదీన విడుదలకు చదమవుతోంది. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ పొందడం విశేషం. ఉసురే చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్లో నిర్వహించారు. ఇందులో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ విజయకుమార్, కార్యదర్శి పేరరసు, దర్శకుడు సుబ్రమణ్యంశివ , సంగీత దర్శకుడు సత్య, మిర్చిశివ పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. మంత్ర మాట్లాడుతూ తన రీఎంట్రీ మంచి చిత్రంతో కావాలని ఆశించానన్నారు. మిర్చి శివ మాట్లాడుతూ ఇది చిత్తూరులో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించినట్లు వారు చెప్పారన్నారు. కిరణ్ జోష్ చక్కని సంగీతాన్ని అందించారని ప్రశంసించారు. లండన్‌కు చెందిన తమిళుడైన టీజే అరుణాచలం ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడం విశేషం అన్నారు. బిగ్‌బాస్ ఫ్రేమ్ జనని ఈ చిత్రం ద్వారా కథానాయకగా పరిచయం అవుతున్నారని ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాదల్ అద్భుతమైన చిత్రమని ఆ చిత్రంలా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు మిర్చి శివ పేర్కొన్నారు.

కాదల్‌లా సక్సెస్ కావాలి