
సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో
– 200 మంది టీచర్లు అరెస్టు
తిరువళ్లూరు: రాష్త్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయుల ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం స్థానిక టోల్‌గేట్ వద్ద రాస్తారోకో చేశారు. కార్యక్రమానికి ఐక్యవేదిక కోఆర్డినేటర్లు రాజాజీ, బాలసుందరం, రాష్ట్ర కోర్డినేటర్ దాస్ హాజరై ప్రసంగించారు. అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించిన మహిళ టీచర్లు 80 మంది సహా రెండు వందలకు పైగా టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు.