
భవనాల నిర్మాణాలకు భూమిపూజ
తిరువళ్లూరు: జిల్లా కేంద్రంలో రూ.6.33 కోట్లతో నిర్మించనున్న రెండు వేర్వేరు భవనాలకు రాష్ట్ర మంత్రి నాజర్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రూ.3కోట్లతో పర్యాటక భవనం, రూ.3.33 కోట్లతో నగర అభివృద్ధి సంస్థ భవనాలను నిర్మించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో భవనాల నిర్మాణాల పనులకు మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ భూమిపూజ చేశారు. మొత్తం 8503.84 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనున్నట్టు మంత్రి నాజర్ వివరించారు.