
చౌక దుకాణ భవనం ప్రారంభం
పళ్లిపట్టు: కీచ్చళంలో చౌక దుకాణం నూతన భవవాన్ని ఎమ్మెల్యే చంద్రన్ ప్రారంభించారు. పళ్లిపట్టు యూనియన్ కీచ్చళం గ్రామంలో చౌక దుకాణ భవనాన్ని తిరుత్తణి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.16 లక్షలతో నిర్మించారు. కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే చంద్రన్ భవనం ప్రారంభించి వినియోగదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. మండల డీఎంకే కార్యదర్శి జి.రవీంద్ర, బీడీఓ అరుల్, ఇంజినీర్ రిషికేష్, డీఎంకే మండల నేతలు ఏకాంబరరాజు, శివానందం, మీసై వెంకటేశన్‌రెడ్డి, గురున్నాథం, మురళి పాల్గొన్నారు.