
రక్తదానంతో ప్రాణదానం
వేలూరు: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డిప్యూటీ మేయర్ సునీల్ కుమార్ అన్నారు. కాట్పాడిలోని జూనియర్ రెడ్‌క్రాస్ సంఘం, జాయిస్ కళాశాల, వేలూరు బ్లడ్ బ్యాంక్, అగర్వాల్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా రక్తదాన దినోత్సవం, ప్రత్యేక కంటి వైద్య శిబిరం రెడ్‌క్రాస్ సంఘం కార్యదర్శి జనార్ధనన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ ఆసుపత్రికి ప్రమాదాలు జరిగి వచ్చే రోగులకు అవసరమైన రక్తాన్ని వెంటనే ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాసన్, రమేష్‌కుమార్ జైన్, కార్యవర్గ సభ్యులు విజయకుమారి, జాయిస్ కళాశాల కరస్పాండెంట్ బెన్నీహెయిన్, నవనీతం పౌండేషన్ వ్యవస్థాపకుడు సత్యానందం, బ్లడ్‌బ్యాంక్ కోఆర్డినేటర్ శివన్, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అధిక సార్లు రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.