
విద్యార్థినికి లైంగిక వేధింపులు
– వృద్ధుడిపై పోక్సో కేసు
పళ్ళిపట్టు: పాఠశాల విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఆర్కేపేట మండలానికి చెందిన విద్యార్థిని (13) ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన డేవిడ్(65) ఇంటికి పిలిచి లైంగికంగా వేధించాడు. బాధితురాలు తప్పించుకుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు లైంగిక దాడి విషయం చెప్పింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తిరుత్తణిలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ మలర్ డేవిడ్‌ను పోక్సో చట్టం కింద మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.