
అనుభవజ్ఞులు లేని పార్టీ విజయం సాధించలేదు
తమిళసినిమా : అనుభవజ్ఞులు లేని ఏ సంఘం, ఏ పార్టీ అయినా విజయం సాధించలేదని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఎంపీ వెంకటేష్ రాసిన వేల్ పారి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం స్థానిక కలైవానర్ అరంగం ఆవరణలో ఏవీ వేలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొనానన్నారు. అదే వేడుకలు ప్రభుత్వ అధికారులు, మంత్రులు పాల్గొన్నారని.. వారంతా తను మిత్రులు లేరని పేర్కొన్నారు. ఆ వేదికపై ఓల్డ్ స్టూడెంట్స్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టమని వారు తరగతల గది నుంచి బయటకు వెళ్లరని చెప్పానన్నారు. అయితే వారంతా మూల స్తంభాలు, వ్యవస్థాపకులు, అనుభవజ్ఞులు కాలేరని, వారు నిర్వహించే సంఘాలు గాని పార్టీలు కానీ విజయం సాధించలేవని అన్నానన్నారు. అయితే తాను చెప్పదలచుకున్నది వేరని , అనుభవజ్ఞులు కాకపోతే విజయం సాధించలేరు అని చెప్పలేక పోయానని అన్నారు. అయితే ఇప్పుడు అలాంటి మిస్టేక్ చేయకూడదు అని, సరిగా మాట్లాడాలని భావించానన్నారు. 1996 ప్రాంతంలో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ని రెండు మూడు సార్లు కలిసే అవకాశం కలిగిందన్నారు. అప్పుడు ఆయన మహారాష్ట్రలో మూడు ఎకరాల పొలం కొనుగోలు చేశానని 10 పశువులు ఉన్నాయని చాలా పుస్తకాలు కొనుగోలు చేశానని ఆ పుస్తకాలు చదువుతూ అక్కడే శేష జీవితాన్ని గడపాలన్న ఆశను వ్యక్తం చేశారన్నారు. అప్పుడు తనకు రాజకీయాల కంటే ఆయన చెప్పిన ఆ విషయం బురల్రోకి ఎక్కిందన్నారు. అప్పటినుంచి మంచి పుస్తకం లభిస్తే విశ్రాంతి సమయంలో అలాంటి ఒక ప్రాంతంలో ఆ పుస్తకాలు చదువుతూ గడపాలన్నది తన కోరిక అని చెప్పారు. దీంతో పలు పుస్తకాలను సేకరిస్తున్నట్లు చెప్పారు కలలు ఏ రూపంలో ఉన్న వాటిని ఆస్వాదించడానికి తమిళ ప్రజలు జాతి, మతం, భాషా భేదాలను చూడరన్నారు. హ్యాట్సాఫ్ నీ కాళ్లకు నమస్కరిస్తున్నాను అని నటుడు రజినీకాంత్ పేర్కొన్నారు.