గూడ్స్‌ రైలులో.. మంటలు | - | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ రైలులో.. మంటలు

Jul 14 2025 5:01 AM | Updated on Jul 14 2025 5:01 AM

గూడ్స

గూడ్స్‌ రైలులో.. మంటలు

చైన్నె తండయార్‌పేట నుంచి ఆదివారం ఉదయం మైసూరు వైపు క్రూడ్‌ ఆయిల్‌తో బయలుదేరిన గూడ్స్‌ ట్యాంకర్‌లో భారీ అగ్నిప్రమాదానికి గురైంది. తిరువళ్లూరు సమీపంలో ఈ ఘటన కలకలం సృష్టించింది. ఐదు జిల్లాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సుమారు పది గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా రైలు సేవలు ఆగాయి. ఇక ఆ పరిసరాలన్నీ దట్టమైన కారు మబ్బులు

కమ్ముకున్నట్టుగా పొగ నిండిపోయింది.

తిరువళ్లూరు: సాధారణంగా ఉదయం వేళలలో చైన్నె వైపుగా కోయంబత్తూరు, బెంగళూరు నుంచి పదుల సంఖ్యలో రైళ్ల రాక పోకలు సాగిస్తుంటాయి. అలాగే ఎలక్ట్రిక్‌ రైళ్ల సేవలు మరింత వేగంగా పరుగులు తీస్తుంటాయి. నిత్యం బిజీగా ఉండే రైల్వేమార్గంలో హఠాత్తుగా జరిగిన ఘటన ప్రయాణికుల్నేకాదు, అధికారులు ఉలిక్కిపడేలా చేసింది. వివరాలు.. చైన్నె తండయార్‌ పేటలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నుంచి 52 ట్యాంకర్‌లతో క్రూడ్‌ ఆయిల్‌తో గూడ్స్‌ రైలు మైసూరు వైపు ఆదివారం ఉదయం బయలుదేరింది. ఒక్కో ట్యాంకర్‌లో సుమారు 70 వేల లీటర్లు ఆయిల్‌ సామర్థ్యం వుంది. ఈ క్రమంలో ట్యాంకర్‌ గూడ్స్‌ రైలు తిరువళ్లూరు రైల్వే స్టేషన్‌ దాటి వెళ్తుతున్న క్రమంలో ఉదయం 5 గంటలకు భారీ శబ్దంతో ప్రమాదానికి గురైంది. రైలు నుంచి ఏర్పడిన శబ్దంతో రైల్వేట్రాక్‌ సమీపంలో నివాసం వుంటున్న సంచార కులాలకు చెందిన కుటుంబాలు, ఎస్టీ సామాజికవర్గ ప్రజలు, వరధరాజర్‌ నగర్‌ ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. స్వల్పంగా ట్యాంకర్‌ నుంచి మంటలు రావడం ప్రారంభమై క్షణాల్లో ఇతర ట్యాంకర్ల వైపుగా వ్యాపించింది. ఇంజిన్‌ నుంచి మూడవ ట్యాంకర్‌తో మొదలైన మంటలు క్షణాల్లో 12 ట్యాంకర్‌లకు వ్యాపించింది.

ఉరకులు పరుగులు..

భారీగా మంటలు ఎగిసిపడి పొగలు కమ్ముకోవడంతో రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వచ్చిన రైల్వే అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రమాధం తీవ్రతను గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన తిరువళ్లూరు, తిరువూర్‌, పేరంబాక్కం తదితర అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా పలితం దక్కకపోగా మరింతగా మంటలు ఎగిసిపడింది. దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి చుట్టుపక్కల రెండు కిలోమీటర్‌ల దూరం మేరకు పొగలు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని కలెక్టర్‌ ప్రతాప్‌, ఎస్పీ శ్రీనివాసపెరుమాల్‌, మంత్రి నాజర్‌, జీఎం ఆర్‌ఎన్‌ సింగ్‌, డీఆర్‌ఎం విశ్వనాథన్‌, రైల్వే ఎస్పి ఈశ్వరన్‌తో పాటు పలువురు ఉన్నత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్తితిని సమీక్షించారు. ప్రమాదం తీవ్రతను గుర్తించి కాంచీపురం, చెంగల్‌పట్టు, రాణిపేట, చైన్నె, తిరువళ్లూరు తదితర జిల్లాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది, వాహనాలను రప్పించారు. దీంతో పాటు గుమ్మిడిపూండి, తిరుమళిసై, అంబత్తూరు, శ్రీపెరంబదూరు సిప్‌కాట్‌లలోని ప్రవేటు పరిశ్రమలకు చెందిన వాహనాలను సైతం పిలిపించి నీటిలో ఫోమ్‌ను కలిపి మంటలను అదుపు చేశారు. దీంతో పాటూ అరక్కోణం జాతీయ విపత్తు నిర్వాహణ బృందాలకు చెందిన సిబ్బందిని సైతం రంగంలోకి దించారు. దాదాపు పది గంటల పాటు శ్రమించిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే 12 ట్యాంకర్‌లు, 8.40 లక్షల లీటర్లు క్రూడ్‌ ఆయిల్‌ అగ్నికి ఆహుతి అయ్యింది.

దట్టమైన పొగ..

ప్రమాదం క్షణాల్లో వ్యాపించిన క్రమంలో మంటలు ఎగిసిపడింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సమీప ప్రాంతాల్లోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. గుండె శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఎస్టీ సామాజిక వర్గాల గృహాలు, సంచార కులాలకు చెందిన ప్రజలు, వరధరాజనగర్‌ ప్రాంతాలకు చెందిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. గర్భిణులు, చిన్నపిల్లలను సైతం అంబులెన్స్‌లో తరలించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఆశ్రయం కల్పించారు. కిలో మీటర్లకొద్ది దట్టమైన కారు మబ్బులుకమ్ముకున్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా పలు గ్రామాల్లో చీకట్లు అలముకున్నాయి.

ఎక్కడికక్కడ ఆగిన రైళ్లు

తిరువళ్లూరు సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. అరక్కోణం నుంచి చైన్నె వైపు వస్తున్న చైన్నె మెయిల్‌ను ఏకాటూరు వద్ద నిలిపి వేయడంతో ప్రయాణికులు దాదాపు మూడు కిలోమీటర్‌ దూరం మేరకు నడక సాగించి తిరువళ్లూరు, మనవాలనగర్‌కు చేరుకుని బస్సు, లోకల్‌ రైళ్ల ద్వారా చైన్నెకు బయలుదేరారు. కాగా సేలం, తిరుపత్తూరు, మైసూరు, బెంగళూరు, తిరుపతి, తిరుత్తణి, కాట్పాడి, జోలార్‌పేట తదితర ప్రాంతాల నుంచి చైన్నె వైపు వచ్చిన రైళ్ళును అక్కడిక్కడే నిలిపి వేశారు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి రైలులోనే వుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగునీరు, ఆహారం అందక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తిరువేళాంగాడు, కడంబత్తూరు తదితర ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా ప్రయాణికులను చైన్నెకు తరలించారు. చైన్నె నుంచి తిరువళ్లూరు మీదుగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన పదికి పైగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరో పది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఎక్కడిక్కడే నిలిపివేవారు. ఐదు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లనుదారి మళ్లించారు. కాగా తిరుత్తణి, తిరువళ్లూరు, తిరుపతి, అరక్కోణం, తిరువణ్ణామలై, కాట్పాడి తదితర ప్రాంతాల నుంచి చైన్నె వైపు వెూటఛీుఽ వందకు పైగా లోకల్‌ రైలు రాకపోకలను సైతం నిలిపివేశారు.

తండయార్‌పేట నుంచి మైసూరుకు వెళ్తున్న సమయంలో ఘోరం క్రూడ్‌ ఆయిల్‌ ట్యాంకర్లు దగ్ధం 70 వేల లీటర్లు సామర్థ్యం వున్న 12 ట్యాంకర్‌లు అగ్నికి ఆహుతి రూ.13 కోట విలువైన 8.40 లక్షల లీటర్ల ఆయిల్‌ నష్టం రెళ్ల రాకపోకలు నిలిపివేత

ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

దెబ్బతిన్న నాలుగు రైల్వే లైన్లు,సిగ్నల్‌ బోర్డు, విద్యుత్‌ లైన్లు

ధ్వంసమైన రైల్వేట్రాక్‌

ప్రమాదం తీవ్రత ఎక్కువ కావడంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగించే ట్రాక్‌లు కూడా చిద్రమయ్యాయి. పట్టాలు సైతం మంటల తీవ్రతకు ముక్కలయ్యా. నాలుగు ప్రధాన లైన్లులోని విద్యుత్‌ లైన్లు, ట్రాక్‌, సిగ్నల్‌ బోర్డులు ద్వంసం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అదే విధంగా ప్రమాదం జరిగిన ప్రాంతాలకు సమీపంలో వున్న నివాసాలకు సైతం విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. వీటి పునరుద్ధరణకు అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం: ఉదయం ఐదు గంటలకు ప్రమాదం జరగ్గా, దాదాపు పది గంటల పాటు శ్రమించిన అధికారులు సాయంత్రం మూడుగంటలకు మంటలు అదుపులోకి తెచ్చారు. మంటలు కాస్త అదుపులోకి రాగానే రైల్వే సిబ్బంది సుమారు మూడువందల మందితో సహాయక చర్యలను ప్రారంభించారు. మొదట నష్టం తక్కువగా వున్న లోకల్‌ రైల్వే ట్రాక్‌లకు విద్యుత్‌ పునరుద్ధరణ, పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో సరిచేయడం, సిగ్నల్‌ బోర్డు మరమ్మతులను ప్రారంభించారు. ఇప్పటికే రైల్వేకు చెందిన భారీ వాహనాలు, 10 ప్రోక్లెయిన్స్‌, జేసీబీలతో పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో వున్న మరో రెండు ట్యాంకర్‌లలోని క్రూడ్‌ ఆలయిల్‌ను లారీలోకి నింపే ప్రక్రియను సైతం ప్రారంభించారు. కాగా రైల్వే ఉన్నత అధికారులుసైతం అక్కడే వుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నాటికి రెండు లైన్లును సరి చేసి రాకపోకలను పునరుద్ధరించే అవకాశం వుంద అధికారులు వెల్లడించారు.

గూడ్స్‌ రైలులో.. మంటలు1
1/3

గూడ్స్‌ రైలులో.. మంటలు

గూడ్స్‌ రైలులో.. మంటలు2
2/3

గూడ్స్‌ రైలులో.. మంటలు

గూడ్స్‌ రైలులో.. మంటలు3
3/3

గూడ్స్‌ రైలులో.. మంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement