
ఘనంగా వాసవీ క్లబ్ సేవలు
కొరుక్కుపేట: చైన్నె ఎగ్మూర్‌లో వాసవీ క్లబ్ చెన్నపట్న, వనిత చెన్నపట్న సంయుక్త ఆధ్వర్యంలో 15వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. క్లబ్‌ల అధ్యక్షులు హెచ్.బాలాజి, పూర్ణిమల నేతత్వంలో జరిగిన వేడుకలకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సౌభాగ్య ఆదికేశవన్ వేడుకలను ప్రారంభించారు. వేడుకల్లో క్లబ్‌లకు 15 సంవత్సరాలుగా అధ్యక్షులుగా సేవలందించిన వారిని ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మింట్‌లోని టైటివి స్కూల్ వేదికగా ఉచిత మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. వేడుకల్లో క్లబ్ సెక్రటరీలు సతీష్, ఉష, కోశాధికారులు అశోక్, జనని, జోన్ చైర్మన్ బాలాజి, ఇమ్మిడి కిషోర్ పాల్గొన్నారు.