
చిత్ర నిర్మాణ రంగంలోకి..
తమిళసినిమా: ఇంతకుముందు పలు మ్యూజికల్ ఈవెంట్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన నాయిస్ అండ్ గ్రెయిన్స్ సంస్థ ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ సంస్థ అధినేతలు కార్తీక్ శ్రీనివాస్, మహావీర్ అశోక్ నిర్మిస్తున్న ప్రొడక్షన్–2 చిత్రం శుక్రవారం ఉదయం చైన్నెలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి కిశోర్ రాజ్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కోమాలి, ఖైదీ, వీఐపీ–2, ఇమైకా నొడిగల్, కీ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. కాగా తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అన్నాబెన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ప్రేమతో కూడిన వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం రూపొందడానికి దర్శకుడు కే.భాగ్యరాజ్ సహకారం చాలా ఉందని పేర్కొన్నారు. కాగా మళ్లీ ఆయన చిత్రాలను గుర్తుకు తెచ్చే విధంగా తమ చిత్రం ఫీల్ గుడ్ ఎంటర్‌టెయినర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈచిత్రంలో అన్నాబెన్ నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ బాలు చాయాగ్రహణం, సహ కథా రచయితగానూ పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు.

చిత్ర నిర్మాణ రంగంలోకి..