
నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
కొరుక్కుపేట: చైన్నె ట్రిప్లికేన్ నియోజకవర్గం స్వతంత్ర నగర్ ఆది ఆంధ్ర ప్రజా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. స్వతంత్ర నగరంలో రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వాహకులైన మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు ఎస్ బాలాజీ, ఎన్ హరినారాయణ, గ్రామ పెద్ద ఏటీ వెంకటేష్‌ల పర్యవేక్షణలో ప్రమాణస్వీకారం జరిగింది. ఇందులో స్వతంత్ర నగర్ ఆదిఆంధ్ర ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎం.కృష్ణమూర్తి, సెక్రటరీగా యూ. హరి, కోశాధికారిగా కేఎల్ శ్రీనివాసన్, ఉపాధ్యక్షుడు టి.వెంకటయ్య, ఉపకార్యదర్శి కె.ఎస్.విష్ణు ప్రసాద్‌ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్, రామనగర్ టామ్స్ నేత పాల్ కొండయ్య పాల్గొన్నారు.