
ఘనంగా అయగు ముత్తుకోన్ జయంతి
వేలూరు: స్వాతంత్య్ర పోరాట యోధుడు అయగు ముత్తుకోన్ 268వ జయంతిని వేలూరులోని ఆయర్ కుల యాదవర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వేలూరు పాత కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అయగు ముత్తుకోన్ చిత్ర పటాన్ని ఉంచి గురు పూజోత్సవంఫొటో ఆవిష్కరణ కార్యక్రమం సంఘం అధ్యక్షుడు జీకే గంగాధరన్ అధ్యక్షతన జరిగింది. అనంతరం ప్రజలకు స్వీట్లు పంచి పెట్టి అన్నదానం చేశారు. ఎమ్మెల్యే కార్తికేయన్, సంఘం ప్రధాన కార్యదర్శి ఎంజీ రమేష్, కోశాధికారి సతీష్‌కుమార్, అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి ఎస్‌ఆర్‌కే అప్పు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి సీకే దేవేంద్రన్, కార్పొరేటర్ టీటా, పారిశ్రామిక వేత్తలు సీకే గణేశన్, వీజీ తులసిరామన్, జీజీఆర్ గోకుల్, తమిళ్‌మణి, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.