
గిరివలయం రోడ్డు
కిటకిటలాడిన
వేలూరు: తమిళ ఆణి మాస పౌర్ణమిని పురష్కరించుకుని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. అరుణాచలేశ్వరాలయంలో పౌర్ణమి గురువారం వేకువజామున 2.33 గంటలకు ప్రారంభమై శుక్రవారం 3.08లకు ముగియడంతో కార్తీకదీపం తరహాలోనే భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆలయంలోని అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు చేశారు. పౌర్ణమి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తిరువణ్ణామలై చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు అధికసంఖ్యలో రావడంతో తిరువణ్ణామలైలో గురువారం రాత్రి గిరివలయం రోడ్డు, ఆలయ మాడ వీధులు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు 6గంటల పాటు క్యూలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగించడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.

గిరివలయం రోడ్డు