
దేశాభివృద్ధికి అడ్డు లేకుండా పెరుగుదల
తిరువళ్లూరు: దేశాభివృద్ధికి ఆటంకం లేకుండా జనాభా పెరుగుదల ఉండాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురష్కరించుకుని తిరువళ్లూరు జిల్లా కలెక్టరేట్ నుంచి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీని కలెక్టర్ ప్రతాప్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ 1987వ సంవత్సరంలో జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు దాటిన క్రమంలో అప్పటి నుంచి ప్రతి ఏటా జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభా 143.81 కోట్లు, రాష్ట్ర జనాభా 7.7 కోట్లకు దాటిందన్నారు. సీ్త్రలకు వివాహ వయస్సు 21గా నిర్ణయించారని, బిడ్డ అన్నారు. తక్కువ వ్యవఽధిలో పిల్లలు కనడం ద్వారా వారిలో పోషక లోపం వుంటుందన్న విషయాన్ని గుర్తించుకోవాలని ఆయన సూచించారు. జాయింట్ డైరెక్టర్‌లు అంబిక, డిప్యూటీ డైరెక్టర్ శేఖర్, ప్రియ, ప్రభాకరన్ పాల్గొన్నారు.