● రూ. 100 కోట్లతో పనులు ● 63 ఆలయాల ఎంపిక ● తమిళాభివృద్ధి సంస్థకు రూ.2.15 కోట్లు ● తిరుక్కురల్‌ పుస్తకం ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

● రూ. 100 కోట్లతో పనులు ● 63 ఆలయాల ఎంపిక ● తమిళాభివృద్ధి సంస్థకు రూ.2.15 కోట్లు ● తిరుక్కురల్‌ పుస్తకం ఆవిష్కరణ

Jul 12 2025 8:23 AM | Updated on Jul 12 2025 9:33 AM

● రూ.

● రూ. 100 కోట్లతో పనులు ● 63 ఆలయాల ఎంపిక ● తమిళాభివృద్ధ

సాక్షి, చైన్నె : వెయ్యి సంవత్సరాల నాటి పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని హిందూమత, దేవదాయ శాఖ విస్తృతం చేసింది. తాజాగా రూ.100 కోట్లతో పునరుద్ధరణ పనుల నిమిత్తం 63 ఆలయాలను ఎంపిక చేశారు. ఈపనులను సీఎం స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో శుక్రవారం ప్రారంభించారు.

డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. 3,297 ఆలయాలను ఇప్పటివరకు అభివృద్ధి చేశారు. ఆక్రమణల్లోని ఆలయాల ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో రాజుల కాలంలో నిర్మించిన ఆలయాలను అక్కడి శాసనాలు, శిల్పాల ఆధారంగా వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాల వివరాల సేకరణను విస్తృతం చేశారు. 714 ఆలయాలు 1000 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు గుర్తించారు. వీటి స్వరూపం చెక్కు చెదరకుండా పునరుద్ధరించే విధంగా 2022–2023 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.425 కోట్ల నిధులను కేటాయించారు. ప్రభుత్వ నిధులు, సేకరించిన విరాళాలతో మొత్తం రూ.571.55 కోట్లతో వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన 352 దేవాలయాల పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకున్నారు. ఇందులో 60 ఆలయాల పునఃప్రతిష్ఠ పూర్తి చేశారు. కుంభాభిషేకాలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో మరో 63 ఆలయాల పునరుద్ధరణకు సిద్ధమయ్యారు. రూ.100 కోట్ల పనులను సచివాలయం నుంచి సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. దేవాలయాల ప్రాచీనత, వాస్తుశిల్పంపై భవిష్యత్తు అధ్యయనాలు భవిష్యత్‌ తరాలకు అందించడం లక్ష్యంగా వాటి పురాతనం చెక్కు చెదరకుండా పనులకు ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌, మంత్రులు దురైమురుగన్‌, పి.కె.శేఖర్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఎన్‌.మురుగానందం పాల్గొన్నారు.

తమిళాభివృద్ధి కొనసాగింపు లక్ష్యం

అనంతరం జరిగిన కార్యక్రమంలో తమిళాభివృద్ధి సంస్థ అభివృద్ధి పనులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగే విధంగా సీఎం చర్యలు తీసుకున్నారు. తమిళ అభివృద్ధి సంస్థకు రూ.2 కోట్ల 15 లక్షల చెక్కు అందజేశారు. ఈ మొత్తాన్ని ఆ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.రాజేంద్రన్‌అందుకున్నారు. 2025–2026 వార్షిక సమావేశం నిర్ణయం మేరకు తమిళ అభివృద్ధి సంస్థ అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటుంది అని సమాచార మంత్రి స్వామినాథన్‌ ప్రకటించారు. ఇందు కోసం రూ.2 కోట్లు నిధి అందజేస్తామన్నారు. రూ.2 కోట్లు డిపాజిట్‌గా అందజేశారు. ఇందులో నుంచి వచ్చే ఆదాయం సహా మొత్తం రూ. 2.15 కోట్లకు చెక్కును రాజేంద్రన్‌కు సీఎం స్టాలిన్‌ అందజేశారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌, మంత్రి స్వామినాథన్‌ పాల్గొన్నారు.

తిరుక్కురల్‌ శ్రీ పుస్తకావిష్కరణ

సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ తరఫున, తిరుక్కురల్‌– సార్వత్రిక జ్ఞానం, ప్రపంచానికే నిధి అన్న పుస్తకాన్ని రూపొందించారు. ప్రపంచ తమిళ భాషా ఫౌండేషన్‌న్‌ సంయుక్త ప్రచురణ ఆంగ్ల అనువాదం కూడా చేశారు. దీనిని సీఎం స్టాలిన్‌ విడుదల చేశారు. ఉదయనిధి స్టాలిన్‌, మంత్రులు ఏవీ వేలు, అన్బిల్‌ మహేశ్‌ పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల వినియోగం కోసం 198 వాహనాలను సీఎం స్టాలిన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఆయా అధికారులకు తాళాలను అందజేశారు. అనంతరం అధికారులు, మంత్రులతో సీఎం స్టాలిన్‌ వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు.

● రూ. 100 కోట్లతో పనులు ● 63 ఆలయాల ఎంపిక ● తమిళాభివృద్ధ1
1/3

● రూ. 100 కోట్లతో పనులు ● 63 ఆలయాల ఎంపిక ● తమిళాభివృద్ధ

● రూ. 100 కోట్లతో పనులు ● 63 ఆలయాల ఎంపిక ● తమిళాభివృద్ధ2
2/3

● రూ. 100 కోట్లతో పనులు ● 63 ఆలయాల ఎంపిక ● తమిళాభివృద్ధ

● రూ. 100 కోట్లతో పనులు ● 63 ఆలయాల ఎంపిక ● తమిళాభివృద్ధ3
3/3

● రూ. 100 కోట్లతో పనులు ● 63 ఆలయాల ఎంపిక ● తమిళాభివృద్ధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement