27, 28 తేదీల్లో మోదీ పర్యటన | - | Sakshi
Sakshi News home page

27, 28 తేదీల్లో మోదీ పర్యటన

Jul 12 2025 8:23 AM | Updated on Jul 12 2025 9:33 AM

27, 2

27, 28 తేదీల్లో మోదీ పర్యటన

సాక్షి, చైన్నె : తమిళనాడులోని మూడు జిల్లాల్లో ఈనెల 27, 28 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్నట్టు సమాచారం తెలిసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కసరత్తులు జరుగుతున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పతనం లక్ష్యంగా బీజేపీ, అన్నాడీఎంకే వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఓ వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరోవైపు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రజల్ని ఆకర్షించే పర్యటనల్లో ఉన్నారు. అమిత్‌షా తరచూ రాష్ట్రానికి వస్తుంటే, పళణిస్వామి తమిళనాడును కాపాడుదాం అనే నినాదంతో యాత్రను విస్తృతం చేశారు. ఈయాత్ర పలు జిల్లాలో ప్రజల్ని ఆకర్షించే విధంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వీరికి మరింత బలాన్ని చేకూర్చే దిశగా ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. డెల్టా జిల్లాల్లో అరియలూరు, పెరంబలూరు వెనుకబడిన జిల్లాలు. అలాగే, తంజావూరు వ్యవసాయానికి ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిది. ఈ మూడు జిల్లాల్లో ఇంతవరకు బీజేపీ అధినాయకుల పర్యటనలు జరగలేదు. తాజాగా మోదీ పర్యటనకు కసరత్తులు జరుగుతున్నాయి. అరియలూరు జిల్లాలో గంగై కొండ చోళపురంలో ఈనెల 20వ తేదీ నుంచి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం 27వ తేదీ జరగనుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు మోదీ రానున్నట్టు సమాచారం. ఇందుకు సంబందించిన ఏర్పాట్లపై బీజేపీ వర్గాలు దృష్టిపెట్టినట్టు తెలిసింది. 28వ తేదీ పెరంబలూరు, తంజావూరులలోనూ పర్యటించే విధంగా మోదీ కార్యక్రమాలకు కసరత్తులు జరుగుతున్నాయి.ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

ఏఐ టెక్నాలజీతో గుర్తించాం!

తీవ్రవాదుల అరెస్టుపై డీజీపీ శంకర్‌జివాల్‌

సాక్షి, చైన్నె: ఏఐ టెక్నాలజీ ఆధారంగా తమ వద్ద ఉన్న అజ్ఞాతంలో ఉన్న తీవ్రవాదుల ఫొటోలను ప్రస్తుతం ఎలా ఉంటారో అలా తీర్చిదిద్ది ముగ్గుర్ని అరెస్టు చేశామని డీజీపీ శంకర్‌ జివాల్‌ తెలిపారు. కోయంబత్తూరు బాంబు పేలుడుతో పాటు పలు కేసుల్లో నిందితులుగా ఉన్న అజ్ఞాత తీవ్రవాదులు అబూబక్కర్‌ సిద్ధిక్‌, మహ్మద్‌అలీ, టైలర్‌ రాజ అలియాస్‌ సాధిక్‌లను తమిళనాడు తీవ్ర వాద నిరోధక విభాగం బృందం గుర్తించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి అరెస్టు గురించి శుక్రవారం డీజీపీ శంకర్‌ జివాల్‌ మీడియాతో మాట్లాడారు. ఆ ముగ్గుర్ని పట్టుకోవడంలో తమకు అత్యాధునిక సాంకేతికత ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. ముఫ్‌పై సంవత్సరాల క్రితం వారు ఎలా ఉన్నారో అనే ఫొటో మాత్రమే తమ వద్ద ఉండేదని, వాటి ఆధారగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ప్రస్తుతం ఎలా ఉన్నారో గుర్తించ గలిగామన్నారు. ఈ ముగ్గురు పూర్తిగా తమ పాత ఐడెంటిటీని రూపు మాపి, కొత్త ఐడెంటితో రియల్టర్‌గా, కూరగాయల మార్కెట్‌ నడుపుతూ విదేశాలకు సైతం వెళ్లి వచ్చినట్టు తేలిందన్నారు. వీరి కోసం ఆరు నెలల పాటు ప్రత్యేక బృందం శ్రమించిందన్నారు. వీరిని మరింతగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక చోట జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని పోలీసు వ్యవస్థపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని తిరుభువనంలో సెక్యూరిటీ అజిత్‌కుమార్‌ లాకప్‌ డెత్‌ ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు చేశారు.

నాకు వ్యతిరేకంగా కుట్ర

సాక్షి, చైన్నె: తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్రే జరుగుతోందని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఆరోపించారు. తన నివాసం నుంచి ట్యాపింగ్‌ పరికరాన్ని గుర్తించామన్నారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి రాందాసు మధ్య సమరం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అన్బుమణిని పార్టీ నుంచి తప్పించే దిశగా రాందాసు తుది నిర్ణయానికి వచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. పీఎంకే రెండు ముక్కలయ్యేనా అన్నట్టుగా తాజా పరిస్థితులు కనబడుతున్నాయి. తన నేతృత్వంలోని మద్దతు వర్గాన్ని అన్బుమణి శుక్రవారం చైన్నెకి పిలిపించారు. వారితో జరిగిన సమావేశంలో తన నేతృత్వంలో పీఎంకే సభ్యత్వ నమోదు వేగవంతం చేయించాలని ఆదేశించారు. బలోపేతం దిశగా అడుగులు వేద్దామని సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాందాసు మరోబాంబు పేల్చారు. తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను ఏమిచేస్తున్నాను, ఏమి మాట్లాడుతున్నానో పసిగట్టేందుకు ట్యాపింగ్‌ పరికరాన్ని ఉపయోగించారని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం తైలాపురం గెస్ట్‌ హౌస్‌లో తన గదిలో సోపా కింద దీనిని గుర్తించామన్నారు. ఇది లండన్‌లో తయారు చేసినట్టుగా ఉందని పేర్కొన్నారు. మైలాడుతురై జిల్లా శీర్గాలిలో వన్నియర్‌ మహిళా సంఘ మహానాడుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఆగస్టు 10న జరగనున్న మహానాడు ఏర్పాట్లను రాందాసు పరిశీలించారు.

27, 28 తేదీల్లో మోదీ పర్యటన 
1
1/2

27, 28 తేదీల్లో మోదీ పర్యటన

27, 28 తేదీల్లో మోదీ పర్యటన 
2
2/2

27, 28 తేదీల్లో మోదీ పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement