
బూత్ ఏజెంట్లే విజయంలో కీలకం
పళ్లిపట్టు: అన్నాడీఎంకే విజయంలో బూత్ ఏజెంట్లే కీలకమని ఎన్నికల వేళ అప్రమత్తంగా వ్యవహరించి ఓటరు జాబితాలో అవకతవకలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బీవీ రమణ అన్నారు. పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరుత్తణి మండలాల్లో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో బూత్ ఏజెంట్ల సమావేశం శనివారం నిర్వహించారు. పళ్లిపట్టు మండల అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహిహించిన బీఎల్‌ఓల సమావేశానికి మండల కార్యదర్శి టీడీ శ్రీనివాసన్ అధ్యక్షత వహించారు. ఇందులో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి బీవీ రమణ, మాజీ ఎంపీ, ఆ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి తిరుత్తణి హరి, జిల్లా ఎన్నికల పరిశీలకులు విజయకుమార్ పాల్గొని బీఎల్‌ఓలకు ఓటరు జాబితాతో పాటు నూతన ఫారాలు, ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్లు చేర్పునకు సంబంధించి అవగాహన కల్పించారు. ఆవిన్ మాజీ చైర్‌పర్సన్ వేలంజేరి కవిచంద్రన్, పొదటూరుపేట టౌన్ చైర్మన్ రవిచంద్రన్, పళ్లిపట్టు పట్టణ కార్యదర్శి జయవేలు, నేతలు శాంతిప్రియ, కృష్ణమ నాయుడు, చంద్రబాబు పాల్గొన్నారు.