తీర్థగిరి కొండపై పూజలు
వేలూరు: వేలూరు సమీపం పుదువసూరులోని తీర్థగిరి వడివేల్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మహా యాగశాల పూజలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం జరగనున్న మహాకుంభాభిషేకానికి ఆలయంలోని స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, దీపారాధన పూజలు నిర్వహించారు. పుదుయనీది పార్టీ అధ్యక్షుడు ఏసీ షణ్ముగం హాజరై పూజలు చేశారు. అనంతరం కుంభిభిషేక ఏర్పాట్లను ఆయన తనఖీ చేశారు. ఆ సమయంలో ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనకు ఆలయ నిర్వహకులు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ శ్రీనివాసన్, గ్రామ సర్పంచ్ బాబు, వేలూరు ప్రియ టెక్స్‌టైల్స్ యజ మాని సురేష్, ఆలయ నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


