
టీటీఎస్‌ఎల్ విజేత డీఆర్‌ఏ డ్రాగన్
– రన్నరప్‌గా వైబ్ విక్టర్స్
సాక్షి,చైన్నె : తమిళనాడు టేబుల్ టెన్నిస్ లీగ్(టీటీఎస్‌ఎల్) సీజన్ 4ను డీఆర్‌ఏ డ్రాగన్ కై వశం చేసుకుంది. వైబ్ విక్టర్స్ రన్నరప్‌గా నిలిచింది. స్పోర్టోరమా, తమిళనాడు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ నేతృత్వంలో అంపా స్కైయోన్ మాల్ వేదికగా చైన్నె లో టేబుల్ టెన్నిస్ పోటీలు జరుగుతూ వచ్చాయి. దేశంలోని యువ ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి, ఆరు జట్లుగా పోటీలను నిర్వహించారు. టైటిల్‌ను లక్ష్యంగా చేసుకుని ఆరు పోటీ ఫ్రాంచైజీలు ఉత్కంఠభరితంగా పోటీ పడడంతో మ్యాచ్‌లన్నీ ఆసక్తికరంగా మారాయి. ఫైనల్స్‌లో వైబ్ విక్టర్స్ నుంచి మహిళల, అండర్–19 బాలికల ఈవెంట్లలో బలమైన ప్రదర్శనకు వేదికగా మారింది. డీఆర్‌ఏ డ్రాగన్ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది. పురుషుల సింగిల్స్, అండర్–19 బాలురు, అండర్–15, పురుషుల డబుల్స్ రాణించి చాంపియన్ షిప్‌ను కై వశం చేసుకుంది. టైటిల్‌ను కై వశం చేసుకున్న డీఆర్‌ఏ డ్రాగన్ రన్నరప్‌గా నిలిచిన వైబ్ విక్టర్ జట్లకు శనివారం నిర్వాహకులు ట్రోఫీలు బహూకరించారు.

టీటీఎస్‌ఎల్ విజేత డీఆర్‌ఏ డ్రాగన్