
గజరాజుపై వేణుగోపాలుడు
కార్వేటినగరం : కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం రాత్రి గజవాహనం , ఉదయం హనుమంత వాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు హనుమంత వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి వసంతోత్సవం, ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని మాడ వీధులో ఊరేగించారు. అదే విధంగా సాయంత్రం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిర్ వారు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను ఆకట్టుకుంది. రాత్రి 7 గంటలకు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గజవాహనంపై కొలువు దీర్చారు. అనంతరం గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశేఖర్, ఆలయ అధికారి సురేష్‌కుమార్, షరాబ్ బాబుసురేష్, కంకణబట్టర్ తరుణ్‌కుమార్, వేద పండుతులు నారాయణ దాసరి, గోపాలాచారి, శభిరీష్, రమేష్, ధన్వంతరి తదితరులు పాల్గొన్నారు.

గజరాజుపై వేణుగోపాలుడు