
బస్ షెల్టర్ ఏర్పాటు
వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్‌లోని కాట్పాడి, చిత్తూరు మార్గంలో వెళ్లే బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు తరచూ ఎండలో నిలవాల్సి వచ్చేదని, దీంతో ప్రత్యేక బస్ షెల్టర్‌ను నిర్మించినట్లు ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు. కొత్త బస్టాండ్‌లో ఏటీఎం, బస్ షెల్టర్ వసతి ఏర్పాటు చేయాలని ప్రజలు పలుమార్లు తన వద్ద విన్న వించారన్నారు. దీంతోనే నియోజక వర్గ నిధుల నుంచి రూ.15 లక్షలతో ప్రస్తుతం బస్ షెల్టర్‌ను నిర్మించి ప్రారంభించాదన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేయర్ సుజాత, కార్పొరేషన్ నాల్గవ జోన్ చైర్మన్ వెంకటేశన్, కార్పొరేటర్‌లు కాంచన, మురుగన్, మహేంద్రన్, డీఎంకే ప్రతినిధులు సుందర్ విజీ, బాలమురళీక్రిష్ణపాల్గొన్నారు.