
అమృత్ స్టేషన్లు
ఆధునిక హంగులతో..
ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు రవాణా మరింత సులభతరం చేస్తూ,రైలు సేవల విస్తృతం దిశగా ఇక్కడి స్టేషన్‌ను రూ. 8.27 కోట్ల తో మెరుగైన సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దారు. పోలూరులో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రాణి షణ్ముగం హాజరయ్యారు. తిరువణ్ణామలై పరిసరాలకు పోలూరు స్టేషన్ కీలకం కావడంతో రూ. 6.15 కోట్లతో ఆధునీకరించారు. చిదంబరంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ తిరుమావళవన్, ఎమ్మెల్యే సిందనై సెల్వన్ హాజరయ్యారు. ఆథ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన చిదంబరం నటరాజ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కుమరింత మెరుగైన సేవల దిశగా రూ. 5.96 కోట్లతో ఈ స్టేషన్‌ను ఆధునీకరించారు. విరుదాలం స్టేషన్ రూ. 9.17 కోట్లతో అప్ గ్రేడ్ చేసి ప్రారంభించారు. మన్నార్ కుడిలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ ఎస్ మురసోలి. మున్సిపల్ చైర్మన్ మన్నై టి. చోళరాజన్ హాజరయ్యారు. డెల్టా జిల్లాలో ప్రధాన ప్రాంతంగా మన్నార్‌కుడి స్టేషన్‌ను రూ. 4.69 కోట్లతో బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అలాగే, దక్షిణ రైల్వే పరిధిలోని పాలక్కాడు డివిజన్‌లో ఉన్న వడకరా , మాహే స్టేషన్లను కూడా ఆధునీకరించారు. మాహేలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె. కై లాష్‌నాథన్, మాహే ఎమ్మెల్యే శ్రీ రమేష్ పరంబత్ హాజరయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి సేవలందిస్తున్న మాహే స్టేషన్ రూ 18.50 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేశారు. ఇక, తిరువనంతపురం డివిజన్‌లోని చిరాయింకీజ్, కన్యాకుమారి జిల్లా కులితురై స్టేషన్లను కూడా ఆధునీకరించి ప్రారంభించారు. కులితురైలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు తారగై, ఎంఆర్ గాంధి, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌లు హాజరయ్యారు. కేరళ – తమిళనాడు మధ్య ఉన్న కులితురై స్టేషన్‌ణు రూ. 5.96 కోట్లతో ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ అమత్ స్టేషన్లలో ప్రతి ఒక్కటి బహుళ–మోడల్ ఇంటిగ్రేషన్, ఆధునిక సౌకర్యాలు , ప్రాంతీయ సాంస్కృతి ప్రతిబంబించే విధంగా, మెరుగైన మౌలిక సదుపాయాల తో స్టేషన్ల అప్‌గ్రేడ్ ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా ప్రాంతీయ రవాణా నెట్‌వర్క్‌కు మరింత బలాన్ని చేకూర్చే విధంగా తీర్చిదిద్దారు.
సాక్షి, చైన్నె: చైన్నె డివిజన్‌లో సెయింట్ థామస్ మౌంట్ స్టేషన్ సుందరంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమానికి సమాచార – ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, తమిళనాడు ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల టిఎం అన్బరసన్, దక్షిణ రైల్వే అదనపు జనరల్ మేనేజర్ కౌశల్ కిషోర్ , చైన్నె డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ తేజ్ ప్రతాప్ సింగ్, సాయుధ దళాల అధికారులు , పద్మ అవార్డు గ్రహీతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చైన్నె నగరంలో సబర్బన్, మెట్రో ప్రయాణికులకు సేవలు అందించే ఇంటర్ చేంజ్ హబ్‌గా రూ. 11.05 కోట్ల వ్యయంతో సెయింట్ థామస్ మౌంట్‌ను పునరాభివృద్ది చేసి ఆధునీకరించారు. ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు, ఆధునిక సౌకార్యాలు కల్పించారు. సేలం డివిజన్ సామల్‌పట్టి స్టేషన్‌లో జరిగిన కార్యక్రమానికి ఎంపీ గోపీనాథ్, ఎమ్మెల్యే తమిళ్‌సెల్వం, సేలం డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ పన్నాలాల్ ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. సేలం–జోలార్‌పేటై లైన్‌లోని కనెక్టింగ్ స్టేషన్‌గా సామల్‌పట్టి స్టేషన్‌ను రూ. 8 కోట్లతో అభివృద్ధి చేశారు. తిరుచ్చి డివిజన్‌లో శ్రీరంగం, తిరువణ్ణామలై, పోలూర్, చిదంబరం, విరుదాచలం మన్నార్గుడి స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు.శ్రీరంగంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ దురై వైకో, ఎమ్మెల్యే పళనియండి , తిరుచ్చి డివిజనల్ రైల్వే మేనేజర్ ఎంఎస్ అన్బళగన్‌లు హాజరయ్యారు. రంగనాథస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు సేవలు అందించే విధంగా రూ. 6.77కోట్లతో శ్రీరంగం స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేశారు. తిరువణ్ణామలైలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ అన్నాదురై, కార్పొరేషన్ మేయర్ నిర్మల హజరయ్యారు.
సేలంలో విద్యార్థులకు బహుమతుల ప్రదానం
తిరువణ్ణామలై స్టేషన్..
దక్షిణ రైల్వేలో 13 స్టేషన్ల పునరాభివృద్ధి
సుందరంగా రూపుదిద్దుకున్న నిర్మాణాలు

అమృత్ స్టేషన్లు

అమృత్ స్టేషన్లు