యువత అప్రమత్తంగా ఉండాలి
తిరువళ్లూరు: యుక్తవయస్సులో యువతీయువకులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా చిన్నపిల్లల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రతాప్ హాజరై, ప్రసంగించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ఆశ్రమాల్లో ఉన్న యువతీయువకులు, చిన్నారులు, విద్యార్థులకు శరీరంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించాలని సూచించారు. యుక్త వయస్సులో హార్మోన్ల ద్వారా వచ్చే మార్పుల ఫలితంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అయితే శరీరం, ఆలోచన విధానాన్ని అదుపులో వుంచుకోవాలని పిలుపునిచ్చారు. యుక్తవయస్సులో పౌష్టికాహారం తీసుకోకపోతే భవిషత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు.


