సెప్టెంబర్‌లో సెట్‌పైకి గాడ్ ఆఫ్ లవ్
తమిళసినిమా: సంచలన నటుడు శింబు తన చిత్రాల విషయంలో స్వీడ్ పెంచారు. ఈయన కమలహాసన్‌తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్‌లైఫ్ చిత్రం జూన్ 5న తెరపైకి రానుంది. ఇది ఆయన నటించిన 48వ చిత్రం. కాగా శింబు తన 49,50,51వ చిత్రాలను ఇటీవల ప్రకటించారు. అందులో 49వ చిత్రాన్ని పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటి కయాదు లోహర్ నాయకిగా నటించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. అదేవిధంగా 50వ చిత్రానికి దేసింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. కాగా శింబు నటించనున్న 51వ చిత్రానికి ఒమై కడవులే, డ్రాగన్ చిత్రాల ఫేమ్ అశ్వద్ మారిముత్తు దర్శకత్వం వహించనున్నారు. దీన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించనుంది. దీనికి గాడ్ ఆఫ్ లైవ్ అనే టైటిల్‌ను నిర్ణయించారు.ఈ చిత్రం గురించి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఏజీఎస్ సంస్థ నిర్వాహకురాలు అర్జన కల్పాత్తి పేర్కొంటూ శింబు హీరోగా చేస్తున్న చిత్రం చాలా పెద్ద బడ్జెట్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర కథే చాలా ఆసక్తిగా ఉంటుందన్నారు. ఇది శింబు అభిమానులకు చాలా సంతృప్తిని కలిగించే చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందులో నటించే కథానాయకిని ఎంపిక చేసినట్లు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటనను ఆగస్ట్ నెలలో విడుదల చేయనున్నట్లు ఆమె చెప్పారు. దీంతో ఈ చిత్ర వివరాల కోసం శింబు అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
శింబుతో
దర్శకుడు అశ్వద్ మారిముత్తు


