
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన
తిరుత్తణి: నిర్లక్ష్యంతో ముందస్తు జాగ్రత్త పాటించకుండా విద్యుత్ మరమ్మతులు చేపట్టడంతో విద్యుత్ సిబ్బంది ప్రాణాలు కోల్పవడాన్ని అరికట్టేందుకు అప్రమత్తుంగా వ్యవహరించాలని రిటైర్డ్ డీఈ అవగాహన కల్పించారు. తిరుత్తణి సబ్ డివిజన్ విద్యుత్ శాఖ ద్వారా తిరుత్తణిలోని ప్రైవేటు కల్యాణ మండపంలో విద్యుత్‌శాఖ సిబ్బందికి అవగాహన శిబిరం శుక్రవారం నిర్వహించారు. డివిజన్ విద్యుత్ శాఖ ఇంజినీరు భాస్కరన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన శిబిరంలో 340 మంది విద్యుత్‌శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ డీఈ లోకమణి పాల్గొని, విద్యుత్ ప్రమాదాలు అరికట్టే విధంగా అప్రమత్తంగా విద్యుత్ స్తంభాలు ఎక్కడం, విద్యుత్ నియంత్రించి మరమ్మతులు చేపట్టడం తప్పనిసరని తెలిపారు. చేతులకు గ్లౌస్‌లు ధరించడం, తాడు కట్టుకుని స్తంభం ఎక్కాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు అరికట్టడంపై సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. విద్యుత్‌శాఖ సహాయ ఇంజినీరు శేఖర్, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.