
కీనో
థ్రిల్లర్ కథా చిత్రంగా
కీనో చిత్రంలో నటుడు మహాతార భగవత్ తదితరులు
తమిళసినిమా: ఎన్నో చిత్రాలు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్త వాళ్లు తమ ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఒక ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక కథాంఽశంతో రూపొందిన చిత్రం కినో. గాంధర్వ సెల్యులాయిడ్ క్రియేషన్స్ పతాకంపై క్రితికాగాంధీ నిర్మించిన ఈ చిత్రానికి మహతార భగవత్, ఆర్‌కే దివాకర్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఆర్‌కే దివాకర్ కథ, సంగీతం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించడం విశేషం. ఆలీవర్ డేనీ ఛాయగ్రహణం అందించిన ఇందులో మహతాక భగవత్, రేణుక సదీశ్, రాజేశ్ గోపిశెట్టి, మాస్టర్ శివ సుకంత్, అన్నామలై సుందర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ థ్రిల్లర్ కథా చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ చిత్ర కథ, కథనాలు వైవిధ్యభరితంగా సాగుతాయి. ఇది చాలా మంది ప్రజల ఆలోచనలను ప్రతిభించే కథా చిత్రం అని చెప్పవచ్చు. ఏదో వస్తోందీ, ఏదో చేయబోతోందని భ్రమ పడి జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకునే మానసిక గ్రస్తుతల గురించి ఆవిష్కరించే కథా చిత్రం కీనో ఒక కుటుంబంలో భార్యభర్తలు, కొడుకు జీవితం సాఫీగా సాగుతుంది. చిన్న చిన్న కోరికలు, అందువల్ల ఎదురైయ్యే సమస్యలు అంటూ సాగే ఆ మధ్య తరగతి కుటుంబంలో కొడుకు ఊహించని సమస్యకు లోనవుతాడు. దీంతో అతని తల్లిదండ్రులు వేదనకు గురౌతారు. వీరిలో తల్లి దైవభక్తి కలిగిన సగటు సీ్త్ర కాగా భర్త నాస్తికుడు. అయితే ఇక్కడ వారి కొడుకుకు కీనో అనే వ్యక్తి తరచూ కనిసిస్తూ భయపెడుతుంటాడు. అసలు కీనో ఎవరు? ఆ కుర్రాడికే ఎందుకు కనిపించి భయపెడతాడు? చివరికి ఏం జరిగింది? వంటి పలు ఆసక్తికరమైన, థ్రిల్లింగ్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం రూపొందినట్లు పేర్కొన్నారు.